‘గీత గోవిందం’ సినిమా ముందు వరకు డైరెక్టర్ పరుశురాం అంటే కేవలం ఇండస్ట్రీ జనాలకే తెలుసు. ‘గీత గోవిందం’ బ్లాక్ బస్టర్ కావడంతో మనోడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సినీ ప్రేమికులందరికీ తెలిసిపోయాడు. గతంలో పరుశురాం తీసిన ‘యువత, సోలో, ఆంజనేయులు, శ్రీరస్తు శుభమస్తు’ వంటి సినిమాలు సూపర్ హిట్స్ కాకపోయినా మంచి సినిమాలుగా నిలిచాయి.
‘గీత గోవిందం’ లాంటి సూపర్ హిట్ చిత్రం ఇచ్చిన పరుశురాం ఇంకా తన నెక్స్ట్ సినిమా ఏంటో ప్రకటించలేదు. ఈసినిమా రిలీజై 100 రోజులు పూర్తయినా.. తన నెక్స్ట్ మూవీ ఇంకా ఫైనల్ చేయలేదు. కథలు అయితే రెడీగా ఉన్నాయి కానీ డేట్స్ ఇచ్చే హీరో మాత్రం కరువయ్యారు అంటున్నారు. ‘గీత గోవిందం’ అంత హిట్ అవ్వడానికి కారణం విజయ్ అని అందులో పరుశురాం చేసింది ఏమి లేదని కొంతమంది భావన.
మరి ఈ భావన అందరిలో నుంచి తొలిగిపోవాలి అంటే పరశురాం వెంటనే ఒక హీరోను పట్టుకుని సినిమా చేయాల్సిందే. కానీ ఇవన్నీ నిజాలు కాదని చెబుతున్నారు పరుశురాం సన్నిహితులు. తన తదుపరి చిత్రం కూడా గీతా ఆర్ట్స్ లోనే చేయనున్నాడు పరుశురాం. మరి ఇతను చేయబోయే ఆ సినిమా హీరో ఎవరో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.