తెలుగులో శర్వానంద్‌తో కలిసి పడి పడి లేచె మనసు సినిమాలో నటిస్తున్న సాయి పల్లవి తన టాలెంట్ మొత్తం ఒకే ఒక పాటతో చూపించేసింది. ఆ సినిమా మీద నిన్నటివరకు ఎలాంటి అంచనాలు ఉన్నాయో తెలియదు కానీ... పడి పడి లేచె మనసు సింగిల్ చూసాక అందులో సాయి పల్లవి లుక్స్, డాన్స్ అన్ని కట్టిపడేసేలా ఉండడంతో.. ఆ సినిమా మీద మంచి అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. డిసెంబర్ 21 న ఈ సినిమా విడుదలకానుంది. ఇక సాయి పల్లవి తమిళనాట కూడా సూర్య సినిమాలోనూ, ధనుష్ తో కలిసి ‘మారి 2’ లోను నటిస్తుంది.
తాజాగా ‘మారి 2’లో రౌడీ బేబీ సాంగ్ లిరిక్స్ ని ఫోటో విజువల్స్ తో విడుదల చేసింది మారి టీం. బాలాజీ మోహన్ దర్శకత్వంలో వండర్ బార్ ఫిలిమ్స్ బ్యానర్ పై ధనుష్ నిర్మిస్తున్న ఈ సినిమాకి సాయి పల్లవి ప్రధాన ఆకర్షణ అనేది ఆ ఫోటో విజువల్స్ లో తెలుస్తుంది. అందమైన లుక్స్ తో ధనుష్ సరసన డాన్సింగ్ స్టెప్స్ తో ఉన్న సాయి పల్లవి క్యూట్ ఫేస్, లుక్స్ అన్ని సూపర్ గా వున్నాయి. ఇక రౌడీ బేబీ సాంగ్ మొత్తం మాస్ నే తలపిస్తుంది. మరి ధనుష్ అండ్ సాయి పల్లవిల గెటప్స్ చూస్తే మాత్రం మాస్ స్టెప్స్ తో ఇరగదీసేలాగే కనబడుతున్నారు.
అన్నట్టు మొన్నీ మధ్యనే మారి 2 ఫొటోస్ లో సాయి పల్లవి ఆటో డ్రైవర్ గెటప్ ని చూసిన వారు ఊర మాస్ గెటప్ అన్నారు. ఇక ఇప్పుడు రౌడీ బేబీ సాంగ్ విజువల్స్ లో సాయి పల్లవి క్లాస్ లుక్స్ తోనూ మాస్ స్టెప్స్ తోనూ ఇరగదీసేలాగే కనబడుతుంది. అయితే ఆ సినిమాలో స్టార్ హీరో ధనుష్ నటనను బీట్ చేస్తుందో లేదో... ఎందుకంటే రౌడీ బేబీసాంగ్ ఫోటో విజువల్స్ లో ధనుష్ లుక్స్ కూడా ఆకట్టుకునేలానే ఉన్నాయి మరి టాలీవుడ్, కోలీవుడ్ సినిమాల్లో సాయి పల్లవి డామినేషన్ మాత్రం రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది.