Advertisementt

మైత్రీ మూవీస్.. కోతలు మొదలైనాయ్..!

Thu 29th Nov 2018 11:39 PM
mythri movie makers,remuneration,chitralahari,sai dharam tej,kishore tirumala,dsp  మైత్రీ మూవీస్.. కోతలు మొదలైనాయ్..!
SaI Dharam Tej Remuneration for Chitralahari film మైత్రీ మూవీస్.. కోతలు మొదలైనాయ్..!
Advertisement
Ads by CJ

మెగా హీరోలలో ఒకరైన సాయి ధరమ్ తేజ్ కు ప్రస్తుతం క్రేజ్ తగ్గటమే కాదు మార్కెట్ కూడా పడిపోయింది. వరసగా మూడు సినిమాలు డిజాస్టర్ అవ్వడంతో అతని మార్కెట్ షేర్‌ దారుణంగా పడిపోయింది. తేజ్‌ నటించిన ‘నక్షత్రం’, ‘ఇంటిలిజెంట్‌’, ‘తేజ్‌ ఐ లవ్యూ’.. అన్నీ మూడు, నాలుగు కోట్ల వసూళ్లతోనే సరిపెట్టుకున్నాయి అంటే అతని మార్కెట్ ఎంతలా పడిపోయిందో అర్ధం చేసుకోవచ్చు.

ఇతను ప్రస్తుతం ‘నేను శైలజ’ ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘చిత్రలహరి’ అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈసినిమా కోసం తేజు తన మేకోవర్‌నే మార్చేశాడు. అయితే ప్రస్తుతం ఇతనికి మార్కెట్ లేకపోవడంతో తేజ్‌కి ఇచ్చే పారితోషికంలో కూడా కోత విధించారు నిర్మాతలు. ఈ సినిమాకు సంబంధించి హయ్యస్ట్‌ చెక్‌ అందుకుంది మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అట.

దేవి తన సినిమాల్లో రెండు మూడు పాటలకు మంచి ట్యూన్స్ ఇస్తాడు కాబట్టి అవి సినిమాను మరింత హైప్ తీసుకుని వెళ్తాయి కాబట్టి ప్రొడ్యూసర్స్ దేవి విషయంలో కాంప్రమైజ్‌ అవలేదట. ఒక్కప్పుడు మైత్రి మూవీస్ వారు సినిమాలో పనిచేసే అందరికి ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఇచ్చేవారు. కానీ వరసగా రెండు సినిమాలు డిజాస్టర్స్ అవ్వడంతో కొంచం జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తుంది. ‘చిత్రలహరి’ విషయంలో అటువంటి జాగ్రత్తలే తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈసినిమాకి ఖర్చులు తగ్గించి, తక్కువ ధరలకి విక్రయించి ఎలా అయినా హిట్ చేయాలనీ డైరెక్టర్ పై ఒత్తిడి పెడుతున్నారని సమాచారం. మరోవైపు తేజు కూడా ఈసినిమాతో తిరిగి ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు.

SaI Dharam Tej Remuneration for Chitralahari film:

Mythri Movie Makers Starts Remuneration Cuttings 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ