Advertisementt

డిసెంబ‌ర్ 7నే రిలీజ్ అంటూ కన్ఫర్మ్ చేశారు

Thu 29th Nov 2018 03:53 PM
kavacham,release date,bellamkonda srinivas,kajal agarwal,december 7  డిసెంబ‌ర్ 7నే రిలీజ్ అంటూ కన్ఫర్మ్ చేశారు
Kavacham Movie Release Date Fixed డిసెంబ‌ర్ 7నే రిలీజ్ అంటూ కన్ఫర్మ్ చేశారు
Advertisement
Ads by CJ

డిసెంబ‌ర్ 7న బెల్లంకొండ శ్రీ‌నివాస్ క‌వ‌చం విడుద‌ల‌.. 

బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్, కాజ‌ల్, మెహ్రీన్ ప్ర‌ధాన‌పాత్ర‌ల్లో వ‌స్తున్న‌ సినిమా ‘క‌వ‌చం’. ఈ చిత్రం డిసెంబ‌ర్ 7న విడుద‌ల కానుంది. టీజ‌ర్‌కు 10 మిలియన్ డిజిటల్ వ్యూస్ అందుకుని.. మంచి స్పందనను రాబట్టుకుంది. ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌తో శ్రీ‌నివాస్ మామిళ్ళ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. కెరీర్‌లో తొలిసారి ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. హర్షవ‌ర్ధ‌న్ రానే, బాలీవుడ్ న‌టుడు నీల్ నితిన్ ముఖేష్ ఈ చిత్రంలో కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే క‌వ‌చం షూటింగ్ పూర్తైంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. ఎస్ఎస్ థ‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండ‌గా.. ఛోటా కే నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. వంశ‌ధార క్రియేష‌న్స్ సంస్థ‌లో న‌వీన్ సొంటినేని(నాని) క‌వ‌చం సినిమాను నిర్మిస్తున్నారు. 

న‌టీన‌టులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజ‌ల్ అగ‌ర్వాల్, మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా, నీల్ నితిన్ ముఖేష్, హ‌ర్షవ‌ర్ధ‌న్ రాణే, పోసాని కృష్ణ‌ముర‌ళి, స‌త్యం రాజేష్, అపూర్వ‌ తదితరులు.

Kavacham Movie Release Date Fixed:

No Change in Kavacham Movie Release Date

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ