Advertisementt

‘పిచాక్’ సాంగ్ పిచ్చెక్కిస్తుందిగా..!!

Thu 29th Nov 2018 03:13 PM
husharu,pichaak song,1m views,husharu movie,rahul rama krishna  ‘పిచాక్’ సాంగ్ పిచ్చెక్కిస్తుందిగా..!!
Husharu Pichaak Song Creates Sensation in Youtube ‘పిచాక్’ సాంగ్ పిచ్చెక్కిస్తుందిగా..!!
Advertisement
Ads by CJ

1 మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతున్న‘హుషారు’ సినిమా ‘పిచాక్’ సాంగ్ 

లక్కీ మీడియా సంస్థలో వస్తున్న ‘హుషారు’ పాటలు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ వరికుప్పల యాదగిరి పాడి, మ్యూజిక్ చేసిన - ‘పిచాక్’ పాట ఇప్పటికే ఆదిత్య మ్యూజిక్ ఛానల్‌లో టాప్ ౩ ట్రెండింగ్ లో 1మిలియన్ వ్యూస్ దాటి ‘హుషారు’ సినిమా రేంజ్‌ని అమాంతం పెంచేసింది. రాహుల్ రామకృష్ణపైన ఎంతో డిఫరెంటుగా పిక్చరైజ్ చేసిన ఈ సాంగ్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ్ణ కెరీర్ లో ది బెస్ట్ గా నిలుస్తుంది. పూర్తి యూత్ ఫుల్ కధాంశంతో తెరకెక్కిన ఈ హుషారు సినిమా డిసెంబర్ (ఏడున) 7న విడుదల అవుతుంది. ఈ చిత్ర యూనిట్ ఇప్పటికే గుంటూరు, విజయవాడ, ఖమ్మం, వరంగల్, నెల్లూరు, రాజమండ్రి, తాడేపల్లి గూడెం, విశాఖపట్నం, శ్రీకాకుళం, కాకినాడ సిటీలో అన్ని ముఖ్య కాలేజెస్‌లో సందడి చేస్తుంది.

బెక్కం వేణుగోపాల్ నిర్మించిన ఈ హుషారు‌కి రియాజ్ మరో నిర్మాత. శ్రీహర్ష కొనుగంటి దర్శకుడు .తేజస్ కంచెర్ల, తేజ్ కూరపాటి, దినేష్ తేజ్, అభినవ్ మేడిశెట్టి హీరోలుగా, దక్ష నగరకర్, ప్రియా వడ్లమాని, హేమల్ హీరోయిన్లుగా నటించారు. రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలో నటించారు.

Husharu Pichaak Song Creates Sensation in Youtube:

1 M views to Husharu Movie Pichak Song

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ