బోయపాటి సినిమాల్లో హీరోయిన్ క్యాథరీన్ ఉండాల్సిందే అనుకుంటా. తను చేసే ప్రతి సినిమాలో ఆమె ఉండేలా చూసుకుంటున్నాడు డైరెక్టర్ బోయపాటి శ్రీను. ‘సరైనోడు’ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఈమెకు ఛాన్స్ ఇచ్చిన బోయపాటి.. ఆ తర్వాత నుంచి ఆమెతో సినీప్రయాణాన్ని జాయింట్ గా కొనసాగిస్తూనే ఉన్నాడు. ఈ సినిమా తరువాత బోయపాటి మరోసారి ఆమెను తన నెక్స్ట్ మూవీ లోను రిపీట్ చేశారు.
బెల్లంకొండ శ్రీనివాస్ తో బోయపాటి చేసిన ‘జయజానకి నాయక’ సినిమాలో కూడా ఆమెకు ఛాన్స్ ఇచ్చాడు. అయితే ఈసారి హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వలేదు. ఐటెం సాంగ్ లో క్యాథరీన్ ను చూపించాడు. మళ్లీ ఇప్పుడు బోయపాటి.. రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ సినిమాలో కూడా ఆమెనే తీసుకోవాలని డిసైడ్ అయ్యాడట. మరోసారి ఆమెను ఐటెం సాంగ్ లో రిపీట్ చేయాలని ఫిక్స్ అవ్వడంతో.. ఈ మూవీ ఐటమ్‌లో క్యాథరీన్ మెరిసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.
మరి బోయపాటి ఆమెను తన ప్రతి సినిమాలో తీసుకోవడంలో ఎందుకు అంత ఇంట్రెస్ట్ పెడుతున్నాడో? మొదట ఐటెం సాంగ్ కోసం ఇలియానాను అనుకున్నారు కానీ ఆమె ఎక్కువ డబ్బులు డిమాండ్ చేయడంతో ఆమె ప్లేస్ లో క్యాథరీన్ తీసుకున్నారు. రకుల్.. కాజల్ పేరులు వినిపించినా బోయపాటి.. క్యాథరీన్ అయితే బాగుంటుందని పట్టుబట్టాడట. సో అలా ఆమెకు రెండోసారి ఐటెం సాంగ్ చేసే ఛాన్స్ వచ్చింది. సంక్రాంతి కానుకగా ఈసినిమా రిలీజ్ అవ్వబోతుంది.