Advertisementt

కాంట్రవర్సీలో ‘2.O’.. విడుదల కష్టమేనా?

Thu 29th Nov 2018 10:45 AM
2 point o,huge controversy,telecom operators,rajinikanth,akshay kumar,shankar  కాంట్రవర్సీలో ‘2.O’.. విడుదల కష్టమేనా?
Telecom operators against Rajinikanth’s 2.0 కాంట్రవర్సీలో ‘2.O’.. విడుదల కష్టమేనా?
Advertisement

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా అమీ జాక్సన్ హీరోయిన్ గా అక్షయ్ కుమార్ విలన్ గా నటించిన చిత్రం ‘2.O’ రేపు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. మరో 24 గంటల్లో రిలీజ్ అవుతున్న ఈ చిత్రం ఇప్పుడు వివాదాల్లో చిక్కుకుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించాడు డైరెక్టర్ శంకర్. ప్రస్తుతం అందరరూ ఎంతో ఇష్టంగా ప్రేమించే మొబైల్ ఫోన్స్.. టవర్స్..ఇందులో నెగటివ్ గా చూపిస్తున్నారని టెలికం ఆపరేటర్లు సంఘం.. సెల్యూలార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఇది రాజ్యంగం ప్రసాదించిన హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని ఈనెల 23న ప్రసార మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. మొబైల్ ఫోన్లు, మొబైల్ టవర్లు నుండి ఎలక్ట్రో‌మ్యాగ్నటిక్ ఫీల్డ్ ఉద్గారాలు వెలువడి మానవాళికి, జంతు, పశుజాలానికి హాని కలిగిస్తున్నాయని ఈ సినిమాలో చూపిస్తున్నారని వారు చెబుతున్నారు. అయితే ఇది పూర్తిగా అపవాదు మాత్రమే తప్ప మరోటి కాదని పేర్కొంది 2.ఓ టీం. సీబీఎఫ్‌సీకి, కేంద్ర ప్రభుత్వానికి వివరణ ఇచ్చే వరకు సినిమా విడుదల చేయకూడదని డిమాండ్ చేస్తుంది. అయితే సీబీఎఫ్‌సీ.. ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన మాట నిజమేనని సీవోఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ పేర్కొన్నారు.

అయితే పెద్ద సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఇటువంటి ఆరోపణలు కామనే అని సోషల్ మీడియా వేదికగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సమస్య సినిమా రిలీజ్ ను అడ్డుకుంటుందా.. అని సినీ ప్రేక్షకులు ఆందోళనతో ఉన్నారు. అంత రెడీ అనుకున్నప్పుడు ఇప్పుడు ఈ సమస్య ఏంటో ఎవరికి అర్ధం కావట్లేదు. మరి ఇది ఎంతవరకు వెళ్తుందో చూడాలి. మరి దీన్ని శంకర్ ఎలా డీల్ చేస్తాడో...

Telecom operators against Rajinikanth’s 2.0:

2.0 Lands In A Huge Controversy

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement