Advertisementt

అజిత్ క్రేజ్‌కి ఇది ఉదాహరణ..!

Wed 28th Nov 2018 12:23 AM
ajith,hero,viswasam,teaser  అజిత్ క్రేజ్‌కి ఇది ఉదాహరణ..!
This is Example for Ajith Craze అజిత్ క్రేజ్‌కి ఇది ఉదాహరణ..!
Advertisement
Ads by CJ

తమిళంలో రజనీకాంత్‌ తర్వాత అజిత్‌, విజయ్‌లు ఆ స్థానం కోసం ఎంతో పోటీపడుతూ ఉంటారు. క్రేజ్‌ విషయంలో ఇద్దరిదీ దాదాపు సమాన స్థాయే అయినా ఒక అడుగు ముందు అజితే ఉంటాడని చెప్పవచ్చు. ఆయన వ్యక్తిగత జీవితంలోని మంచితనం కూడా దీనికి ప్లస్‌ అవుతుంది. కాగా అజిత్‌ ఇప్పటి వరకు కెమెరామెన్‌ కమ్‌ డైరెక్టర్‌ శివ దర్శకత్వంలో ‘వీరం, వేదాళం, వివేగం’ వంటి చిత్రాలలో నటించాడు. ‘వివేగం’ చిత్రంలో వివేక్‌ ఒబేరాయ్‌ విలన్‌గా నటించగా, కాజల్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం అజిత్‌ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందింది. ఈ మూవీ పెద్దగా అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినా కూడా కేవలం అజిత్‌ పుణ్యాన రికార్డు కలెక్షన్లు సాధించింది. 

ప్రస్తుతం అజిత్‌ మరోసారి శివ దర్శకత్వంలో ‘వి’సెంటిమెంట్‌ని ఫాలో అవుతూ ‘విశ్వాసం’ చిత్రం చేస్తున్నాడు. ఇందులో సౌత్‌ఇండియన్‌ సూపర్‌స్టార్‌గా పేరొందిన నయనతార హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషంగా చెప్పాలి. ఇతర పాత్రల్లో జగపతిబాబు, వివేక్‌, తంబి రామయ్య, కోవై సరళ వంటి వారు నటిస్తున్నారు. సత్యజ్యోతి ఫిలింస్‌ బేనర్‌పై టి.త్యాగరాజన్‌ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని పొంగల్‌ బరిలో దించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం మోషన్‌ పోస్టర్‌ని తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో అజిత్‌ వీర మాస్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఈ మోషన్‌ సోస్టర్‌లో పండుగ వాతావరణాన్ని చూపించారు. దీనికి విశేషమైన స్పందన లభించింది. 24గంటలు కూడా కాకముందే 34లక్షల వ్యూస్‌ని సాధించింది. 

అంతేకాదు.. ఇది యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో మొదటి స్థానంలో ఉంది. 3.5లక్షల మంది ఈ మోషన్‌ పోస్టర్‌ తమకి బాగా నచ్చిందని లైక్‌లు చేయడం విశేషంగా చెప్పాలి. ఇక ‘విశ్వాసం’ చిత్రం తర్వాత అజిత్‌ మరోసారి ఓ ప్రయోగం చేయనున్నాడు. బాలీవుడ్‌లో వచ్చిన ‘పింక్‌’ చిత్రంలో బిగ్‌బి అమితాబ్‌బచ్చన్‌ పోషించిన పాత్రను అజిత్‌ పోషించనుండటం విశేషంగా చెప్పుకోవాలి. 

This is Example for Ajith Craze :

Viswasam Teaser Creates Sensation

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ