Advertisementt

హీరో ప్రేమ వ్యవహారంలో వేలెట్టిన మరో హీరో!

Tue 27th Nov 2018 10:57 PM
arjun kapoor,top secret,koffee with karan show,ranbir kapoor  హీరో ప్రేమ వ్యవహారంలో వేలెట్టిన మరో హీరో!
Hero revealed Top Secret at Koffee with Karan Show హీరో ప్రేమ వ్యవహారంలో వేలెట్టిన మరో హీరో!
Advertisement
Ads by CJ

తెలుగులో మన సినిమా వారు చెప్పేవి నిజం అని నమ్మేలా ఉండవు. ఏదో ఒకటి మాట్లాడేస్తూ ఉంటారు. కానీ ఈ విషయంలో బాలీవుడ్‌ స్టార్స్‌ తీరేవేరు. వారు ఏదైనా చిక్కు ప్రశ్న అడగాలే గానీ నిజాలను నిర్భయంగా ఒప్పుకుంటూ ఉంటారు. ఇక విషయానికి వస్తే హిందీలో వచ్చే ‘కాఫీ విత్‌ కరణ్‌’ షో ఓ బూతు షో అనే విమర్శలు ఉన్నాయి. అది నిజమే.. కానీ కరణ్‌ తనకున్న పరిచయాలతో, తనకు తెలిసిన వాస్తవాలతో ఈ షోకి వచ్చే వారి చేత పలు నిజాలు చెప్పిస్తూ ఉంటాడనేది మాత్రం నిజం. అలాంటి వారు తెలుగులో లేరనే చెప్పాలి. 

ఇక తాజాగా కాఫీ విత్‌ కరణ్‌ కార్యక్రమానికి అర్జున్‌కపూర్‌, ఆయన సోదరి జాన్వికపూర్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా కరణ్‌.. అర్జున్‌కపూర్‌ని ఉద్దేశించి, ప్రేమ విషయాలలో సలహాలు తీసుకోవడానికి నీవు రణవీర్‌సింగ్‌ వద్దకు వెళ్తావా? వరణ్‌ధావన్‌ వద్దకు వెళ్తావా? అని సూటిగా ప్రశ్నించాడు. దానికి తగ్గట్లుగానే అర్జున్‌కపూర్‌ కూడా ఎంతో నిజాయితీగా సమాధానం ఇస్తూ, ప్రేమ వ్యవహారాలలో సలహా కోసం రణవీర్‌? వరుణ్‌? వద్దకు వెళ్లడమా? (నవ్వుతూ) మీకేమైనా పిచ్చా? రణబీర్‌ ఒకసారి నాకు ప్రేమ విషయంలో సలహా ఇచ్చాడు. ఆ తర్వాతి రోజే ప్రియురాలితో నేను బంధం తెంచుకోవాల్సివచ్చింది. అప్పుడు రణబీర్‌, నేను బాల్కనీలో కూర్చుని ఉన్నాం. రణబీర్‌ ఆకాశంలోకి చుక్కల వైపు చూస్తూ, నువ్వు ఆనందంగా లేవనుకుంటే పక్కకు వచ్చేయడమే మంచిది అన్నారు. 

ఆ తర్వాత నేను నా ఫోన్‌ తీసుకుని నాకు నీతో మాట్లాడాలని ఉంది.. అని నా ప్రియురాలికి మెసేజ్‌ పెట్టాను. మరుసటి రోజే ఆమెకి దూరం అయ్యాను. దాదాపు వారం రోజులు బాగా బాధపడ్డాను.తిరిగి మూమూలు వ్యక్తిని కావడానికి చాలా రోజులు పట్టింది. కాబట్టి రణబీర్‌ సలహాలను ఎప్పుడు తీసుకోవద్దు. నటులు ఒకరికొకరు మంచి సలహాలను ఇచ్చుకోలేరని నాకు తర్వాత అర్దమైంది. ఇది నిజం కూడా.. అని చెప్పాడు. కాగా ప్రస్తుతం అర్జున్‌కపూర్‌.. మలైకా అరోరాతో ప్రేమలో ఉన్నాడు. త్వరలోనే ఆమెను వివాహం చేసుకుంటానని కూడా అర్జున్‌ ఇదే షోలో చెప్పడం గమనార్హం. 

Hero revealed Top Secret at Koffee with Karan Show:

Arjun Kapoor Once Broke Up With A Girl On Ranbir Kapoor Advice

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ