Advertisementt

2.O టీమ్‌కి తెలుగంటే ఇంత చిన్నచూపా?

Tue 27th Nov 2018 04:10 PM
rajinikanth,2.0 movie,promotions,investments  2.O టీమ్‌కి తెలుగంటే ఇంత చిన్నచూపా?
2.0 Telugu Poor Promotions 2.O టీమ్‌కి తెలుగంటే ఇంత చిన్నచూపా?
Advertisement

‘బాహుబలి’ సినిమా నేషనల్ వైడ్ మూవీ కాబట్టి రాజమౌళి దానికి తగ్గట్టే ప్రమోషన్స్ చేశాడు. ఇండియాలో ఉన్న అన్ని ఇండస్ట్రీస్ ని దాదాపు కలుపుకుపోయాడు జక్కన్న. హైదరాబాద్ లో ‘బాహుబలి’ తెలుగు ఆడియో ఫంక్షన్ చేసిన జక్కన్న ఆ తరువాత చెన్నైలో తమిళ ఆడియో ఫంక్షన్ చేశాడు. హిందీ వాళ్ల కోసం ముంబై లో ప్రెస్ మీట్స్ పెట్టారు. ‘బాహుబలి’ టీం కూడా ఇండియాలో మెయిన్ మెయిన్ సిటీస్ కు వెళ్లి ప్రచారం చేయడంతో ఈసినిమాకు నేషనల్ వైడ్ గా గుర్తింపు వచ్చింది.

‘బాహుబలి’ కు మించి ఎక్కువ బడ్జెట్‌ పెట్టిన ‘2.ఓ’ పబ్లిసిటీ విషయంలో చాలా వెనుక బడింది. చెన్నైలో ఆడియో లాంచ్ చేసి మన తెలుగు మీడియా  ప్రతినిధులను కొంతమందిని తీసుకుని వెళ్లారు అంతే. ఆ తరువాత తెలుగులో ఒక్క ప్రమోషన్ కూడా చేయలేదు. మన తెలుగు సినిమాలను అక్కడ బాగా ప్రమోట్ చేస్తూ ఉంటారు. కానీ శంకర్ ఎందుకని తెలుగులో ప్రమోషన్స్ చేయడం లేదో అర్ధం కావట్లేదు. ఇది ఇండియా వైడ్ గర్వించే సినిమా కాబట్టి అన్ని భాషల్లో ప్రమోషన్స్ చేస్తే కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అవి ఏమి పటించుకోవట్లేదు ‘2.ఓ’ టీం. ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్తాన్‌’ కోసం అమితాబ్‌ బచ్చన్‌, అమీర్ఖాన్‌ తెలుగులో మాట్లాడిన స్పెషల్‌ వీడియోను విడుదల చేశారు.  కానీ రజనీకాంత్‌, శంకర్‌ మాట్లాడిన మాటలు వీడియో చేసి తెలుగు వారికి విడుదల చేయలేకపోతున్నారు?

రజిని లేటెస్ట్ గా తమిళ వాళ్ల కోసం ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు.. శంకర్ బాలీవుడ్ వాళ్ళకోసం ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. మరి తెలుగు వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? ఎందుకని తెలుగు వారంటే అంత చిన్న చూపు? తమిళంలో కన్నా తెలుగులోనే ఎక్కువ థియేటర్స్ లో ఈసినిమా రిలీజ్ అవుతుంది. మరి తెలుగులో ఎందుకు మీడియాలో ప్రచారం గురించి పట్టించుకోవడం లేదో?? ట్రైలర్ పెద్ద ఇంట్రెస్ట్ గా ఏమి లేదు. అలాంటప్పుడు ప్రమోషన్స్ చేసుకుంటే ఓపెనింగ్స్ బాగా వచ్చి సేఫ్ సైడ్ అయ్యే అవకాశముంది. ఆ దిశగా అయితే మేకర్స్ ఆలోచించట్లేదు. మరో నాలుగు రోజుల్లో ఈసినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. ఎట్టకేలకు సోమవారం తెలుగువారి కోసం 2.ఓ టీమ్ ఓ ప్రెస్‌మీట్ నిర్వహించినా.. సినిమా అయితే ఇంకా ప్రేక్షకులలోకి గట్టిగా వెళ్లలేదనేది మాత్రం అర్ధమవుతోంది. ఎందుకంటే మరో నాలుగు రోజుల్లో సూపర్ స్టార్ మూవీ విడుదల అవుతుంటే.. అసలు సందడేది..?

2.0 Telugu Poor Promotions:

2.0: Rich in Investments! Poor in Promotions!!  

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement