Advertisementt

వివాదంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌!

Tue 27th Nov 2018 10:22 AM
sonakshi sinha,heroine,case filed,bollywood  వివాదంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌!
Bollywood Star Heroine in Controversy వివాదంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌!
Advertisement
Ads by CJ

అలనాటి బాలీవుడ్‌ రెబెల్‌స్టార్‌ శతృఘ్నుసిన్హా కుమార్తెగా సోనాక్షిసిన్హా హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది. బాలీవుడ్‌లో బొద్దు గుమ్మగా పేరు తెచ్చుకుంది. ‘దబాంగ్‌, దబాంగ్‌2, అఖిరా, రౌడీరాథోడ్‌, రాజ్‌కుమార్‌, సన్నాఫ్‌ సర్దార్‌, లుటేరా, హాలీడే’ వంటి పలు చిత్రాలలో ఈమె నటించింది. కె.యస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ నటించిన ‘లింగా’ చిత్రం ద్వారా తమిళ, తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయింది. నాడు ఆమెకి ఇండియన్‌ మైఖేల్‌ జాక్సన్‌గా పేరొందిన ప్రభుదేవాకి ఎఫైర్‌ ఉన్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. 

తాజాగా ఆమె ఓ చీటింగ్‌ వివాదంలో ఇరుకున్నది. సోనాక్షితో పాటు ఆమె మేనేజర్‌, మరో ఐదుగురు తమని మోసం చేశారని, ఇండియన్‌ ఫ్యాషన్‌ అండ్‌ బ్యూటీ అవార్డ్స్‌ కంపెనీ పోలీసులను ఆశ్రయించింది. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకుగాను తాము సోనాక్షికి 28లక్షలు చెల్లించామని వారు తమ పోలీస్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే చెప్పిన సమయానికి సోనాక్షి రాలేదని, తాము ఇచ్చిన 28లక్షలు తిరిగి ఇవ్వడానికి నిరాకరిస్తోందని వారు వాదిస్తున్నారు. 

సోనాక్షి రాకపోకల కోసం విమానం టిక్కెట్లు కూడా బుక్‌ చేయించామని ఆ సంస్థ నిర్వాహకులు వాపోతున్నారు. అయితే నగదు తిరిగి చెల్లించమని తాము కోరుతుంటే తమని చంపేస్తామని సోనాక్షి మేనేజర్‌ బెదిరిస్తున్నాడని, ఈ వ్యవహారంలో తమకి న్యాయం చేయాలని ముషీరాబాద్‌ పోలీసులకు సంస్థ యజమాని ప్రమోద్‌శర్మ ఫిర్యాదు చేశాడు. దీనిపై చీటింగ్‌ కేసు నమోదు చేసిన పోలీసులు కేసును విచారిస్తున్నారు. 

Bollywood Star Heroine in Controversy:

Case filed in Bollywood Heroine Sonakshi Sinha

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ