Advertisementt

ఇలియానా.. ఇలా అయితే కష్టమే..!

Mon 26th Nov 2018 01:36 PM
ileana,shock,vinaya vidheya rama,item song,remuneration  ఇలియానా.. ఇలా అయితే కష్టమే..!
Ileana Shocks VVR, In Turn AAA Shocks Her ఇలియానా.. ఇలా అయితే కష్టమే..!
Advertisement
Ads by CJ

దేవుడు చేసిన మనుషులు డిజాస్టర్ తో తెలుగు తెరకు దూరమైన గోవా బ్యూటీ ఇలియానా మళ్లీ అమర్ అక్బర్ ఆంటోని అనే డిజాస్టర్ తో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది. మధ్యలో బాలీవుడ్ లో జెండా పాతుదామని ఎగిరిపడిన ఇలియానా మళ్లీ తెలుగులోనే కెరీర్ ని నిలబెట్టుకుందామనుకుంటుంది. అందుకే రవితేజ రికమండేషన్ తో తెలుగులోకి మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది. మరి ఎన్నో ఆశలు పెట్టుకున్న ఇలియానాకి అమర్ అక్బర్ ఆంటోని భారీ షాకిచ్చింది. మరి ఆ సినిమా డిజాస్టర్ తో ఇలియానా తన డిమాండ్ ఏమన్నా తగ్గిస్తుందేమో అనుకుంటే... అబ్బే అలాంటిదేం లేదంటుంది.

రామ్ చరణ్ - బోయపాటి వినయ విధేయ రామ కోసం ఐటెం గర్ల్ సెర్చింగ్ జరుగుతుంది. ముందు రకుల్ ప్రీత్ అన్నారు తర్వాత బాలీవుడ్ హీరోయిన్ అన్నారు. కానీ తాజాగా రీఎంట్రీ ఇచ్చిన ఇలియానాని వినయ విధేయ రామ టీం సంప్రదించింది. అయితే మళ్ళీ తెలుగులో పాతుకుపోవడానికి ఆ ఐటెం సాంగ్ కి ఓకే చెప్పిన ఇలియానా ఆ సాంగ్ కోసం 60 లక్షలు డిమాండ్ చేసిందంటూ ఫిలింసర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి భారీ డిజాస్టర్, ప్రస్తుతం ఫామ్‌లో లేని ఇలియానా ఇలా 60 లక్షలు డిమాండ్ చేసేసరికి వినయ విధేయ రామ టీంకి దిమ్మతిరిగిందట.

హిట్ లేకపోయినా ఇలియానాకి పొగరు తగ్గలేదని.. పారితోషకం విషయంలో ఇంత నిక్కచ్చిగా ఉంటే.. ఆమెకి అవకాశాలిచ్చేదెవరు అంటూ కామెంట్స్ పడుతున్నాయి. అసలే మునుపటి గ్లామర్ కోల్పోయిన ఇలియానా సందట్లో సడేమియా అన్నట్లుగా బాగా బరువు కూడా పెరిగింది. ఇలాంటి టైంలో పారితోషికం కోసం పట్టుబడితే..బాలీవుడ్ మాదిరిగా.. ఇక్కడ కూడా అవకాశాలు కోసం ఎదురు చూడాల్సి వస్తుంది.

Ileana Shocks VVR, In Turn AAA Shocks Her:

Ileana Shocked VVR But AAA Gave Her Shocking Result

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ