Advertisementt

‘అరవింద..’ రూటులోనే ‘వినయ విధేయ రామ’!

Sun 25th Nov 2018 10:29 PM
vvr makers,mistake,aravinda sametha,vinaya vidheya rama,ntr,ram charan  ‘అరవింద..’ రూటులోనే ‘వినయ విధేయ రామ’!
Vinaya Vidheya Rama Follows Aravinda Sametha ‘అరవింద..’ రూటులోనే ‘వినయ విధేయ రామ’!
Advertisement
Ads by CJ

సినిమా హిట్టు.. ప్లాప్ అనేది సినిమాకి వచ్చిన వసూల్ బట్టే ఉంటుంది. సినిమా బాగుంది కదా అని ఎక్కువ రేట్స్ కి అమ్మితే తరువాత వచ్చే వసూల్ అమ్మినదానికన్నా తక్కువ వస్తే అది ప్లాప్ కిందే వస్తుంది. ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ విషయంలో అదే జరిగింది. సినిమా హిట్ అని బయట టాక్ వచ్చినా సినిమా ఎక్కువ రేట్స్ కి అమ్ముకోవడంతో బ్రేక్‌ ఈవెన్‌ కాకుండానే సరిపెట్టింది. అయితే రామ్ చరణ్ - సుకుమార్ లు ‘రంగస్థలం’ విషయంలో సినిమాను తక్కువకే అమ్మి జాగ్రత్త పడ్డారు. దాంతో ఈసినిమా 125 కోట్ల షేర్‌ వసూలు చేసింది.

అయితే ఇప్పుడు ‘రంగస్థలం’ సినిమాను చూపించుకుని.. బోయపాటి - చరణ్ కాంబినేషన్ ను చూపించుకుని ‘వినయ విధేయ రామ’ చిత్రానికి భారీ రేట్లు కోడ్ చేస్తున్నారు మేకర్స్. కానీ ‘రంగస్థలం’ మాదిరిగా ‘వినయ విధేయ రామ’ యూనివర్సల్‌ సినిమా కాదు. ఇది పక్కా మాస్ ఎంటర్టైనర్ అని టీజర్ చూస్తే అర్ధం అయిపోతుంది. మాస్‌ ఆడియన్స్‌ మినహా ఇలాంటి చిత్రాలకి మిగతా వర్గాల నుంచి ఆదరణ అంతగా వుండదు.

‘అరవింద సమేత’ మేకర్స్ చేసిన తప్పే ‘వినయ విధేయ రామ’ మేకర్స్ కూడా చేస్తున్నారు. అది దృష్టిలో వుంచుకుని మార్కెట్‌ చేసుకుంటే సక్సెస్‌ కావచ్చు. లేకపోతే బ్రేక్‌ ఈవెన్‌ కాకుండానే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఎలా పడితే అలా అమ్మితే తరువాత వసూల్ రాకపోతే హీరోలు ఖాతాలో ఫ్లాప్‌ జమ చేరుతుంది. రెండు పాటలు మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈసినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతుంది.

Vinaya Vidheya Rama Follows Aravinda Sametha :

VVR Makers Doing Same Mistake Like Aravinda Sametha Makers

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ