మొదటి నుంచి మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌ది ఎడ్డెమంటే తెడ్డం అనే రకం. మలయాళ నటి భావన కిడ్నాప్, రేప్ యత్నం కేసులో నిందితుడైన తన సహ నటుడు దిలీప్‌కి ఆయన మద్దతు ఇస్తున్నాడు. మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్.. దిలీప్‌పై ఈగ వాలకుండా చూసుకుని విమర్శల పాలయ్యాడు. తాజాగా దుబాయ్‌లో మీటూ ఉద్యమం మూణ్ణాళ్ల ముచ్చటే అని, అది పబ్లిసిటీ కోసం చేస్తున్న చెత్త, ఇదో ఫ్యాషన్ అని నోరు పారేసుకున్నాడు.
దీనిపై సామాజిక కార్యకర్తగా, హీరోయిన్, దర్శకురాలిగా బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన రేవతి మండిపడింది. ఆమె మాట్లాడుతూ, పేరు పొందిన ఓ నటుడు దీనిని ఫ్యాషన్ అంటున్నాడు. వీరిలో కొంచమైనా సున్నితత్వం ఎలా తీసుకుని రావాలి? అంజలీ మీనన్ అన్నట్లు అంగారక గ్రహం నుంచి వచ్చిన వారికి వేధింపుల గురించి తెలిసే అవకాశం లేదు.. అంటూ అసలు మోహన్‌లాల్ మనిషే కాదన్నట్లు పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇక మోహన్‌లాల్ మీటూ ఉద్యమంపై ఇలాంటి చెత్త వ్యాఖ్యలు చేసి మరలా వాటిని వెనక్కి తీసుకున్నాడు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నేనింత వరకు అలాంటి వేధింపులు ఎదుర్కోలేదు. నాకు దానిపై మాట్లాడే హక్కు లేదు. మేము కూడా మీటు ఉద్యమంతో బయటకు రావచ్చు. ఎవరైతే దాని బారిన పడతారో వారే దాని గురించి మాట్లాడే హక్కు ఉంటుంది. కేవలం ఎవరు పడితే వారు కామెంట్స్ చేయడం సరికాదు. మీటూ గురించి నాకు పెద్దగా తెలియదు..అని చెప్పుకుని రావడం గమనార్హం.