Advertisementt

కన్నడ రెబల్ స్టార్ కన్నుమూశారు

Sun 25th Nov 2018 04:57 PM
ambareesh passes away,kannada rebel star,sumalatha husband,actor ambareesh  కన్నడ రెబల్ స్టార్ కన్నుమూశారు
Kannada Star Ambareesh No More కన్నడ రెబల్ స్టార్ కన్నుమూశారు
Advertisement
Ads by CJ

కాంగ్రెస్ సీనియర్ నేత, కన్నడ సూపర్ స్టార్ అంబరీష్ శనివారం రాత్రి కన్ను మూశారు. ఒకప్పటి టాప్ హీరోయిన్ సుమలత భర్త అయిన అంబరీష్ గుండెపోటుతో బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మైసూర్‌ రాష్ట్రంలోని మాండ్యలోని దొడ్డరసినకెరెలో 1952 మే 29న హుచ్చే గౌడా, పద్మావతమ్మ దంపతులకు జన్మించిన ఆయన అనేక తెలుగు సినిమాల్లోనూ నటించారు. అంబరీష్ - సుమలత దంపతులకు ఒక కుమారుడు అభిషేక్‌ గౌడ ఉన్నారు. కన్నడ రెబల్‌ స్టార్‌గా పేరుతెచ్చుకున్న అంబరీష్ దాదాపుగా 200 చిత్రాల్లో నటించారు. అయితే గత కొంతకాలంగా కిడ్నీ, శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నఅంబరీష్ గత రాత్రి గుండెపోటు రావడంతో ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచారు.

కన్నడ సినిమాల్లో విలక్షణమైన పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అంబరీష్‌, నటి సుమలతను 1991లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత రాజకీయాల్లో అంబరీష్.. మన్మోహన్‌ సింగ్‌, సిద్దరామయ్య మంత్రివర్గంలోనూ మంత్రిగా కూడా పనిచేశారు. అనారోగ్య కారణాల చేత గత ఎన్నికల నుండి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అంబరీష్ మృతికి టాలీవుడ్, కోలీవుడ్, కన్నడ ప్రముఖులంతా సంతాపం తెలుపుతున్నారు.

Kannada Star Ambareesh No More:

Kannada Rebel star Ambareesh Passes Away

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ