వంశి పైడిపల్లి - మహేష్ కాంబోలో మొదటిసారిగా తెరకెక్కుతున్న మహర్షి మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో 8 కోట్లతో వేసిన పల్లెటూరి సెట్ లో జరుగుతుంది. దిల్ రాజు బ్యాచ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. సోనాల్ చౌహన్ సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ లో నటిస్తుందనే ప్రచారం ఉంది. ఇకపోతే ఈ మహర్షి మూవీలో అల్ల్లరి నరేష్, మహేష్ ఫ్రెండ్ గా నటిస్తున్నాడు. ఈ సినిమా అమెరికాలోని న్యూయార్క్ లోను... కొంతమేర షూటింగ్ పూర్తి చేసుకుంది. మహేష్ ఈ సినిమాలో రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలు అంటే ఒకటి ఒక పెద్ద కంపెనీ సీయివో గాను మరొకటి రైతు పాత్రలోనూ కనిపించనున్నాడు.
అయితే ఈ సినిమా మహేష్ ని ఢీ కొట్టబోయే పవర్ ఫుల్ విలన్ పాత్రలో విలక్షణ నటుడు సాయి కుమార్ నటించబోతున్నాడు. సాయి కుమార్ మెయిన్ విలన్ గా నటిస్తున్నాడని... ఇంకొంతమంది విలన్స్ కూడా ఉంటారని చెబుతున్నారు. మరి వంశి పైడిపల్లి గత చిత్రమైన ఎవడు సినిమాలో రామ్ చరణ్ కి ధీటుగా విలన్ పాత్రలో సాయి కుమార్ ఇరగదీశాడు. అందుకే ఈసారి మహర్షి కోసం కూడా వంశి పైడిపల్లి విలన్ గా సాయి కుమార్ నే దించుతున్నాడు. కానీ ఇప్పుడు ఈ విలన్ విషయంలో మహేష్ ఫ్యాన్స్ మాత్రం కాస్త అసంతృప్తిగా ఉన్నారంటున్నారు.
ఎందుకంటే ఇప్పుడున్న స్టార్ హీరోలంతా బాలీవుడ్ విలన్స్ ని పెట్టుకుని సినిమాలు చేస్తుంటే... మహేష్ మాత్రం ఇలా టాలీవుడ్ నటుడితోనే పని కానిచ్చేస్తున్నారు. అయితే ఈ విలన్ విషయంలో మహర్షి క్రేజ్ తగ్గుతుందనే భావనలో మహేష్ ఫ్యాన్స్ ఉన్నట్లుగా వార్తలొస్తున్నాయి. మరి నిజంగా మహేష్ ఫ్యాన్స్ అంటున్నారని కాదు గాని... రామ్ చరణ్ వినయ విధేయ రామ లో బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ తో తలపడుతుంటే ... సాహో సినిమాలో ప్రభాస్ నీల్ నితిన్ ముఖేత్ తో తలపడుతున్నాడు. మరి మహేష్ ఇలా లోకల్ నటుడితో పని కానిచ్చేయడం మహేష్ ఫ్యాన్స్ కి రుచించడం లేదు. అయితే సాయి కుమార్ కూడా తక్కువ నటుడేమి కాదు ఆయన డైలాగ్ డెలివరీ, ఫేస్ లోని క్రూరత్వం అన్ని కూడా విలన్ గా ఆయన్ని ఒక స్థాయిలో తీసుకెళ్లే అంశాలే.