Advertisementt

చైతూ-సామ్‌ ఎలా ఎంజాయ్‌ చేస్తున్నారో చూశారా!

Sun 25th Nov 2018 02:33 PM
samantha,naga chaitanya,birthday,goa,celebrate  చైతూ-సామ్‌ ఎలా ఎంజాయ్‌ చేస్తున్నారో చూశారా!
Chaitu takes off to Goa to Celebrate his Birthday with Wife Samantha చైతూ-సామ్‌ ఎలా ఎంజాయ్‌ చేస్తున్నారో చూశారా!
Advertisement
Ads by CJ

అక్కినేని నాగచైతన్య తన 32వ బర్డ్‌డేని జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అటు అక్కినేని ఫ్యామిలీకి, ఇటు దగ్గుబాటి ఫ్యామిలీకి కావాల్సిన వాడు కావడంతో వీరి అభిమానులు కూడా చైతూ బర్త్‌డే వేడుకలను జరుపుకున్నారు. ఇక నాగచైతన్య-సమంతలు ప్రస్తుతం ‘నిన్నుకోరి’ ఫేమ్‌ శివనిర్వాణ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ని చైతు బర్త్‌డే కానుకగా విడుదల చేసినా కూడా అందులో అందరు అనుకుంటున్నట్లు ‘మజిలి’ అనే టైటిల్‌ను మాత్రం కన్‌ఫర్మ్‌ చేయలేదు. కేవలం ప్రొడక్షన్‌ నెంబర్‌2 అని మాత్రమే పేర్కొన్నారు. 

ఇక ఈ చిత్రం షూటింగ్‌ ఇటీవలి వరకు వైజాగ్‌, సింహాచలంలో జరిగింది. తర్వాత యూనిట్‌ హైదరాబాద్‌కి వచ్చింది. అలా వచ్చిన వెంటనే సమంత తన భర్త చైతుని బర్త్‌డే సందర్భంగా గోవాకి తీసుకుని వెళ్లింది. అక్కడ అత్యంత సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో చైతు బర్త్‌డే వేడుకలు జరిగాయట. ఈ సందర్భంగా తాము తీయించుకున్న ఫొటోలను సమంత సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసింది. ఇందులో చైతన్యని సమంత ముద్దు పెట్టుకుంటున్న ఫొటో బాగా వైరల్‌ అవుతోంది. 

ఈ సందర్భంగా ఆమె ‘నా స్నేహితుడు, నా గురువు, నా ప్రాణం, నాకోసం పుట్టిన ఒకే ఒక్క వ్యక్తి నాగచైతన్యకి జన్మదిన శుభాకాంక్షలు’ అని తెలుపుతూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలియజేసింది. ఇక వీరిద్దరు నటిస్తున్న ‘మజిలి’ (ఇంకా ఫైనల్‌ కాలేదు)లో వారిద్దరు నిజజీవితంలోలాగానే వెండితెరపై కూడా భార్యాభర్తలుగా కనిపిస్తారని, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు, వాళ్ల అనుబంధం నేపధ్యంలో ఈ చిత్రం సాగుతుందని తెలుస్తోంది. ఇక ఇందులో దివ్యాంష కౌశిక్‌ అనే ముంబై మోడల్‌ సెకండ్‌ హీరోయిన్‌గా ఎంతో ప్రాధాన్యం ఉన్న పాత్రను చేస్తోంది. 

Chaitu takes off to Goa to Celebrate his Birthday with Wife Samantha:

 Samantha wishes Birthday Boy Naga Chaitanya with a kiss

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ