Advertisementt

అద్నాన్ స‌మీ ఈ పాటని ‘ఇష్టంగా’ పాడారట!!

Sun 25th Nov 2018 09:48 AM
adnan sami,ishtamgaa movie,title song,release  అద్నాన్ స‌మీ ఈ పాటని ‘ఇష్టంగా’ పాడారట!!
Adnan Sami Likes This song Very much అద్నాన్ స‌మీ ఈ పాటని ‘ఇష్టంగా’ పాడారట!!
Advertisement
Ads by CJ

అరెరే మాయే జ‌రిగిందే.. ఇష్టంగా.

మ‌న‌సే నీదే అయ్యిందే.. ఇష్టంగా..

అంతా క‌ల‌లా తోచిందే .. ఇష్టంగా..

అయినా చాలా బాగుందే .. ఇష్టంగా..!

ప్రాణం.. ప‌య‌నం నీతోనే.. ఇష్టంగా.. అరెరే మాయే..

ఇంతందంగా పాడాలంటే అందుకు అంతే ఇంపైన గాత్రం కావాలి. అలాంటి ప్రేమ‌గీతానికి ప్ర‌ఖ్యాత గాయ‌కుడు అద్నాన్ స‌మీ పాడాలంటే..? ఆయ‌న్ని ఒప్పించ‌డం అంత సులువా?  కానీ ఆ ఫీట్‌ని నిజం చేసి స‌త్తా చాటుకుంది ‘ఇష్టంగా’ టీమ్. ఆయ‌న ఎంతో ఇష్ట‌ప‌డి.. నేనే పాడ‌తాను అంటూ ఉత్సాహంగా ముందుకొచ్చారంటే ఆ లిరిక్‌లో ఆ బాణీలో ఉన్న మ‌త్తు ఎంతో అనే క‌దా అర్థం. గ‌మ్మ‌త్తైన ప‌ద‌జాలంతో ఆహ్లాద‌క‌ర‌మైన బాణీతో అంత అందంగా కుదిరిన మెలోడియ‌స్ ప్రేమ‌గీతం వేరొక‌టి ఇటీవ‌ల లేనేలేదంటే అతిశ‌యోక్తి కాదు. ఇష్టంగా టీమ్ సాధించిన తొలి బిగ్ సక్సెస్ ఇది. ఈ మాట అంటోంది చిత్ర టీమే కాదు.. పాట వింటున్న శ్రోత‌లు కూడా. ఎ.వి.ఆర్ మూవీ వండర్స్ పతాకంపై సంపత్. వి రుద్ర‌ దర్శకత్వంలో అడ్డూరి వెంకటేశ్వరరావు నిర్మిస్తోన్న చిత్రం ‘ఇష్టంగా’. అర్జున్ మహి, తనిష్క్ రాజన్ జంటగా నటిస్తున్నారు. రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ ఇది. స్టార్ క‌మెడియ‌న్ ప్రియదర్శి ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇటీవ‌లే రిలీజైన ఫ‌స్ట్ లుక్‌ మంచి స్పందన రాబట్టుకుంది. తాజాగా రిలీజ్ చేసిన ‘ఇష్టంగా’ పాట‌కు చాలా మంచి స్పందన వస్తుందని చిత్రయూనిట్ తెలుపుతుంది. నేటి జ‌న‌రేష‌న్ ప్రేమికుల గ‌మ్మ‌త్త‌యిన ప్రేమ‌కు ప్ర‌తిరూపంగా ఈ పాట‌ను అంతే అందంగా చిత్రీక‌రించార‌ని ఈ విజువ‌ల్స్ చెబుతున్నాయి. అద్నాన్ స‌మీ ఈ పాట‌ను మ‌రో స్థాయిలో పాడి శ్రోత‌ల‌కు కానుకిచ్చారు.  

ఈ సందర్భంగా ద‌ర్శ‌క‌నిర్మాత‌లు మాట్లాడుతూ.. ‘‘మెగాస్టార్ కి .. ‘ఏ జిల్లా ఏ జిల్లా..’ అంటూ అద్నాన్ స‌మీ పాడిన పాట‌ను ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేం. ఓ ప్రియా ప్రియా అంటూ నితిన్ ‘ఇష్క్‌’ కోసం అద్భుత‌మైన మెలోడీని పాడారాయ‌న‌. ఆ త‌ర్వాత టాలీవుడ్‌లో ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్ సాంగ్స్‌ని పాడారు అద్నాన్ స‌మీ. తాజాగా మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ యుగ‌ళ‌గీతాన్ని ‘ఇష్టంగా’ చిత్రానికి పాడినందుకు కృత‌జ్ఞ‌త‌లు. అంత మంచి సంగీతం ఇచ్చిన యేలేంద్ర‌కు కృత‌జ్ఞ‌త‌లు. అన్ని ప‌నులు పూర్త‌య్యాయి. త్వ‌ర‌లోనే రిలీజ్ చేస్తున్నాం. ఈ సాంగ్ లానే ఇష్టంగా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొడుతుంది..’’ అన్నారు.  అర్జున్ మహి, తనిష్క్ రాజన్, ప్రియదర్శి, దువ్వాసి మోహన్, తాగుబోతు రమేష్, మధునందన్, మధుమణి, విశ్వేష్వర్ నెమిలకొండ, ఫిష్ వెంకట్  తదితరులు నటిస్తొన్న ఈ చిత్రానికి రచన సహకారం: చిట్టి శర్మ, సినిమాటోగ్రఫీ: ఆనంద్ నడకట్ల డిఎఫ్ ఎమ్, సంగీతం: యేలేంద్ర మహావీర్, కూర్పు: బొంతల నాగేశ్వర్ రెడ్డి, మాటలు: శ్రీనాధ్ బాదినేని, పాటలు: చంద్రబోస్, కందికొండ, రంబాబు గోశాల, అలరాజు, ఆర్ట్: విజయ్ కృష్ణ, ఫైట్స్: షావలిన్, మల్లేష్, పి.ఆర్.ఓ: సాయి సతీష్, నిర్మాత: అడ్డూరి వేంకటేశ్వర రావు, కథ-స్క్రీన్ ప్లే- దర్శకత్వం: సంపత్.వి.రుద్ర‌

Click Here for Song

Adnan Sami Likes This song Very much:

Ishtamgaa movie Title Song Released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ