సందీప్ కిషన్ నిర్మాతగా ‘నిను వీడని నీడను నేనే’ టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల
తెలుగు, తమిళంలో వైవిధ్యమైన సినిమాల్లో కథానాయకుడిగా నటిస్తూ తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న హీరో సందీప్ కిషన్. ఈ యువ కథానాయకుడు ఇప్పుడు నిర్మాతగా మారారు. సందీప్ కిషన్, దయా పన్నెం సంయుక్తంగా స్థాపించిన నిర్మాణ సంస్థ వెంకటాద్రి టాకీస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1గా సందీప్ కిషన్, అన్య సింగ్ హీరోహీరోయిన్‌గా కార్తీక్ రాజు దర్శకత్వంలో దయా పన్నెం, వి.జి.సుబ్రహ్మణ్యన్ నిర్మాతలుగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న చిత్రం ‘నిను వీడని నీడను నేనే’. ఈ సినిమా రషెష్‌ను చూసిన విస్తా డ్రీమ్ మర్చంట్స్ ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యారు. ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనీల్ సుంకర ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు కార్తీక్ రాజు మాట్లాడుతూ.. ‘‘సూపర్ నేచురల్ కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని డిఫరెంట్ పాయింట్‌తో, హై టెక్నికల్ వేల్యూస్‌తో సినిమాను రూపొందిస్తున్నాం. వైవిధ్యమైన సినిమాలు చేసిన హీరో సందీప్ కిషన్ నటిస్తోన్న తొలి సూపర్ నేచురల్ థ్రిల్లర్ ఇది. సందీప్ కిషన్‌ను మరో కొత్త పాత్రలో చూస్తారు. అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే చిత్రమవుతుంది. త్వరలోనే ట్రైలర్, పాటలు విడుదల తేదీని ప్రకటిస్తాం..’’ అన్నారు.
నిర్మాత దయా పన్నెం మాట్లాడుతూ.. ‘‘దర్శకుడు కార్తీక్ చెప్పిన కథ చాలా బాగుంది. సూపర్ నేచురల్ నేపథ్యంలో సాగే చిత్రమిది. సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయ్యింది. మరో ఆరు రోజుల షూటింగ్ మాత్రం మిగిలి ఉంది. మా సినిమా రషెష్ చూసి ‘గూఢచారి’ వంటి హిట్ చిత్రాన్ని విడుదల చేసిన విస్తా మర్చంట్స్ ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం వహించారు. అలాగే ప్రముఖ నిర్మాత అనీల్ సుంకరగారు ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సినిమాను విడుదల చేయడానికి ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా విస్తా మర్చంట్స్, అనీల్ సుంకరగారికి థ్యాంక్స్’’ అన్నారు.
సందీప్ కిషన్ స్నేహితుడు శివా చెర్రీ.. మేనేజర్ సీతారాం ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్నారు.
సందీప్ కిషన్, అన్య సింగ్, పోసాని కృష్ణ మురళి, మురళీ శర్మ, వెన్నెలకిషోర్, రాహుల్ రామకృష్ణ, పూర్ణిమ భాగ్యరాజ్, ప్రగతి తదితరులు నటించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: నాయుడు-ఫణి(బియాండ్ మీడియా), ఆర్ట్: విదేశ్, ఎడిటర్: కె.ఎల్.ప్రవీణ్, సంగీతం: ఎస్.ఎస్.తమన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: శివా చెర్రీ, సీతారాం, కిరుబాకరన్, సినిమాటోగ్రఫీ: ప‌్రమోద్ వర్మ, నిర్మాతలు: దయా పన్నెం, వి.జి.సుబ్రహ్మణ్యన్, దర్శకత్వం: కార్తీక్ రాజు.