కమెడియన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన సునీల్.. హీరోగా మాత్రం అందాల రాముడు, మర్యాద రామన్న సినిమాలతోనే హిట్స్ అందుకున్నాడు కానీ... హీరోగా చేసిన మిగతా సినిమాలన్నీ యావరేజ్ గాను ప్లాప్స్ గానే మిగిలాయి. అందుకే హీరోగా కష్టమని భావించిన సునీల్ ఇప్పుడు మళ్లీ కమెడియన్ గా టర్న్ తీసుకున్నాడు. ఇకపోతే గతంలో ఇషా చావ్లాతో కలిసి సునీల్ పూలరంగడు సినిమాలో నటించాడు ఆ సినిమా పర్లేదనిపించింది. ఇక నిర్మాత అంజి రెడ్డి కూడా పూలరంగడు సినిమాతో గట్టెక్కాడు. అయితే పూలరంగడు సినిమా టైంలో సునీల్ హీరోగా మంచి ఫామ్ లోనే ఉన్నాడు.
అయితే పూలరంగడు ఓ మోస్తరు హిట్ అవడంతో.. ఆ సినిమా నిర్మాత అంజి రెడ్డి మళ్ళీ సునీల్ తో మరో సినిమా చెయ్యాలనే ఉద్దేశ్యంతో.. సునీల్ కి అడ్వాన్స్ కూడా ఇచ్చాడట. అయితే ఆ అడ్వాన్స్ కూడా లక్షల్లో కాదు... అక్షరాలా కోటి రూపాయలు అంజి రెడ్డి సునీల్ కి అడ్వాన్స్ గా ఇచ్చాడట. అయితే సునీల్ కి అడ్వాన్స్ అయితే ఇచ్చాడు కానీ.... ఆ తర్వాత సునీల్ తో సినిమా చేద్దామంటే అంజి రెడ్డికి సరైన దర్శకుడు దొరకకపోవడం ఒకసారి... దర్శకుడు రెడీగా ఉన్నప్పుడు సునీల్ కి డేట్స్ లేకపోవడంతో.. అంజిరెడ్డి అప్పటి నుండి సునీల్ తో సినిమా చెయ్యలేకపోయాడట.
అయితే సినిమా చెయ్యడం కుదరడం లేదు కాబట్టి.. తన అడ్వాన్స్ వెనక్కి ఇవ్వమని అంజిరెడ్డి సునీల్ ని అడుగుతుంటే... సునీల్ మాత్రం అడ్వాన్స్ వెనక్కి ఇవ్వకుండా అంజి రెడ్డిని చుట్టూ తిప్పుకుంటున్నాడని... అంజి రెడ్డి అప్పటి నుండి సునీల్ పై గుర్రుగా వున్నాడని అంటున్నారు. అసలే ఒక అమ్మాయి తప్ప సినిమాతో పూర్తిగా కష్టాల్లోకి వెళ్లిపోయిన అంజి రెడ్డి.. ఇప్పుడు సునీల్ కూడా అడ్వాన్స్ వెనక్కి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని టాక్ అయితే జోరుగా నడుస్తుంది.