#RRR మూవీ స్టార్ట్ అయ్యే నాలుగు రోజులు కూడా కాలేదు ఇంతలోనే బాడ్ న్యూస్. రామ్ చరణ్- ఎన్టీఆర్ నటిస్తున్న ఈసినిమా యొక్క షూటింగ్ ఈనెల 19 నుండి స్టార్ట్ అయింది. అయితే రాజమౌళి ఈసినిమా షూటింగ్ చేస్తున్న టైములో ఆస్వస్థతకి గురి అయ్యాడట. దాంతో షూటింగ్ సడెన్ గా ఆపేయాల్సి వచ్చిందని టాక్. ఇది పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి రాజమౌళి లేకుండా కో డైరెక్టర్ ని పెట్టి షూటింగ్ చేయలేరు కాబట్టి రాజమౌళి పూర్తిగా కోలుకున్నాకే షూటింగ్ స్టార్ట్ చేయాలని చరణ్ అండ్ తారక్ చెప్పారట. ఇలా షూటింగ్ కి బ్రేక్ పడడం వల్ల ప్రొడ్యూసర్ కి కొంత లాస్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇతర నటీనటులు కాల్ షీట్స్ ముందుగానే ఫిక్స్ అయ్యి ఉంటాయి కాబట్టి.
ఇది ఇలా ఉంటే నేషనల్ వైడ్ మార్కెట్ రావాలని జక్కన్న ఇందులో కొత్త టెక్నాలజీ ఉపయోగిస్తున్నాడట. భారీ మల్టీస్టారర్ కావడంతో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పోరాట దృశ్యాలను చిత్రీకరించేందుకు 4డీ టెక్నాలజీని జోడించినట్టు తెలుస్తోంది. ఈ ఫైట్ సీన్ తీసేందుకు ఏకంగా 120 కెమెరాలను జక్కన్న తెప్పించి షూట్ చేస్తున్నాడట. సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వకముందు రాజమౌళి ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్యకు చెబితే ఏమి ఆలోచించకుండా ఓకే అనేసారట.
ఈ కెమెరాన్‌తో షూట్ చేయటం వల్ల వచ్చే ఎఫెక్ట్స్ చాలా పవర్ ఫుల్ గా ఉంటాయంటున్నారు సినీ వర్గాలు. సీన్స్ లో నటీనటుల హావభావాలు, ముఖ కవళికలను మరింత చక్కగా ఇవి క్యాప్చర్ చేస్తాయట. దాదాపు 30 రోజులు పాటు జరగనున్న ఈ ఫైట్ సీక్వెన్స్ కు భారీగా ఖర్చు పెడుతున్నారని చెబుతున్నారు. హైదరాబాద్ శివార్లలో అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్‌లో ఈ ఫైట్ సీక్వెన్స్ కి షూట్ చేస్తున్నారు. ఈ మూవీ 2020లో ప్రేక్షకుల ముందుకు రానుంది.