Advertisementt

రామ్ చరణ్‌కు 12 కోట్లు.. మహేష్‌కు 8 కోట్లు!

Fri 23rd Nov 2018 07:14 PM
mahesh babu,maharshi,set,village set,ram charan,rangasthalam movie,sukumar,vamsi paidipalli  రామ్ చరణ్‌కు 12 కోట్లు.. మహేష్‌కు 8 కోట్లు!
12 Crores Set for Ram Charan.. 8 Crores Set for Mahesh babu రామ్ చరణ్‌కు 12 కోట్లు.. మహేష్‌కు 8 కోట్లు!
Advertisement
Ads by CJ

సుకుమార్ డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన రంగస్థలం సినిమాలో విలెజ్ సెట్ ఎంతందంగా ఉందో సినిమాలో చూశారు. మొదట్లో రంగస్థలం షూటింగ్‌ని చాలా రోజులవరకు గోదావరిని ఆనుకుని ఉన్న.... రాజమండ్రి పరిసర ప్రాంతాల పల్లెటూర్లలో చిత్రీకరించారు. కానీ రామ్ చరణ్‌కు ఉన్న క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో అక్కడ సినిమా షూటింగ్ చెయ్యడం తలకు మించిన కష్టం అవడంతో సుకుమార్ హైదరాబాద్ నడిబొడ్డున జూబ్లీహిల్స్ ప్రాంతంలో 22 ఎకరాల్లో 12 కోట్ల ఖర్చుతో పల్లెటూరి సెట్‌ని ఆర్ట్ డైరెక్టర్ చేత వేయించాడు. మరి రంగస్థలం సినిమా మొత్తం ఆ ఊరిలో తీయాల్సి రావడంతో సుకుమార్ అంత ఖర్చు పెట్టించాడు.

ఇక తాజాగా మహేష్ బాబు.. మహర్షి సినిమా కోసం హైదరాబాద్ లోనే పల్లెటూరి సెట్ రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. కొంతమేర అమెరికాలో షూటింగ్ చేసిన మహర్షి టీం ప్రస్తుతం పల్లెటూరి వాతావరణం ప్రతిబింబించే పల్లెటూరి సెట్ లో జరుగుతుంది. దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ పల్లెటూరి సెట్‌ని 8 కోట్ల‌తో వేయించాడట. అయితే మహర్షి సినిమా ఎక్కువ శాతం గ్రామీణ నేపథ్యంలో ఉంటుందట. మహేశ్ బాబు రైతు పాత్రలో ఈ పల్లెటూరి సెట్ లోనే కనబడతాడని సమాచారం. అయితే రంగస్థలం లాగా మొదట్లో మహర్షి టీం కూడా ఈ పల్లెటూరి షూటింగ్ కోసం నిజమైన గ్రామాల్లో షూట్ చేద్దామని భావించి ఆంధ్రలోని కొన్ని గ్రామాలకు వెళ్లి చూసి వచ్చారట.

కానీ రామ్ చరణ్ మాదిరిగానే మహేష్ ఫ్యాన్స్ కూడా షూటింగ్ జరగకుండా ఇబ్బందులు పెడితే షూటింగ్ కి గ్యాప్ వచ్చేస్తుందనే ఆలోచనతోనే ఇలా మహర్షి కోసం పల్లెటూరి సెట్ ని దించారట. మరి ఆ 8 కోట్ల పల్లెటూరి సెట్ లో చిత్రీకరించే పల్లెటూరి సన్నివేశాలు మహర్షి మూవీలో కీలకం కానున్నాయని అంటున్నారు. ఇక దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీ లు ఖర్చుకి వెనకాడకుండా మహర్షి కోసం భారీ మొత్తం ఖర్చు పెడుతున్నారట. 

12 Crores Set for Ram Charan.. 8 Crores Set for Mahesh babu:

Mahesh Babu Maharshi Movie Latest Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ