ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ వారు తమ బ్యానర్ లో ఎన్నో సినిమాలు చేశారు. అందులో చాలావరకు సూపర్ హిట్ అయ్యాయి. రీసెంట్ గా వచ్చిన ‘సవ్యసాచి’, ‘అమర్ అక్బర్ ఆంటొని’ తప్ప మిగిలిన సినిమాలు హిట్ అవ్వడమే కాదు మంచి వసూల్ కూడా తెచ్చిపెట్టాయి. ఒక సినిమా లైన్‌లో ఉండగానే మరో సినిమా కోసం పలువురు హీరోలకు, దర్శకులకు అడ్వాన్స్ ఇచ్చేస్తూ ఉంటారు మైత్రి వారు.
అలానే త్రివిక్రమ్ శ్రీనివాస్ కి సినిమా చేయమని ఎప్పుడో అడ్వాన్స్ ఇచ్చారట. అయితే ప్రస్తుతం త్రివిక్రమ్.. అల్లు అర్జున్ తో ఓ సినిమా చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆ సినిమాను తమ బ్యానర్ లో చేయమని అడిగారట. దానికి త్రివిక్రమ్ మైత్రి వారికి ప్రస్తుతానికి నో అని చెప్పాడట. కావాలంటే మీ అడ్వాన్స్ మీకు తిరిగి ఇచ్చేస్తాను అంటూ చెప్పాడట.
దాంతో ఖంగుతిన్న మైత్రి మూవీస్ వాళ్ళు మా అడ్వాన్స్ ఇవ్వాల్సి వస్తే దానికి వడ్డీతో సహా వేసి ఇవ్వాలని కొంచం గట్టిగా చెప్పారట. మరి అందుకు త్రివిక్రమ్ ఒప్పుకున్నాడో లేదో తెలియదు కానీ త్రివిక్రమ్ ఓన్లీ హారిక హాసిని క్రియేషన్స్ వారితో మాత్రమే సినిమాలు చేయాలనీ నిర్ణయించుకున్నాడట.