పూర్ణ ప్రధాన పాత్రలో శ్రీకృష్ణ క్రియేషన్స్ కొత్త చిత్రం ప్రారంభం!
శ్రీకృష్ణ క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం-1గా పూర్ణ ప్రధాన పాత్రలో గౌరికృష్ణ నిర్మిస్తోన్న చిత్ర షూటింగ్ ప్రారంభోత్సవం బుధవారం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఈ చిత్రం ద్వారా అన్నం చిన్నికృష్ణ దర్శకుడుగా పరిచయమవుతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రముఖ మాటల రచయిత మరుధూరి రాజా ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నివ్వగా నిర్మాత ఫాదర్ ఇ.రమేష్ కెమెరా స్విచాన్ చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత గౌరికృష్ణ మాట్లాడుతూ.. ‘‘నేను తెలుగులో పలు చిత్రాలను రిలీజ్ చేశాను. తొలిసారిగా నిర్మాతగా మారి ఈ సినిమా నిర్మిస్తున్నా. మా దర్శకుడు చెప్పిన కాన్సెప్ట్ నచ్చి పూర్ణ గారైతే పర్ఫెక్ట్ యాప్ట్ అని ఆమెను తీసుకున్నాం. అలాగే ఎన్నోసినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించిన బాల్ రెడ్డిగారు, పెప్పీ సాంగ్స్ తో తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరుచుకున్న భీమ్స్ సిసిరోలియోగారు మా సినిమాకు వర్క్ చేస్తున్నారు. ఇలా ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా టాలెంటెడ్ టెక్నిషీయన్స్ తో సినిమా నిర్మిస్తున్నాం. డిసెంబర్ ఫస్ట్ వీక్ లో షూటింగ్ ప్రారంభించి సింగిల్ షెడ్యూల్ లో కంప్లీట్ చేసి.. సమ్మర్‌లో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం..’’ అన్నారు.
దర్శకుడు అన్నం చిన్నికృష్ణ మాట్లాడుతూ.. ‘‘డైరక్టర్‌గా ఇది నా తొలి సినిమా. మా నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా గ్రాండ్ గా సినిమా చేయడానికి అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. పర్ఫార్మెన్స్‌కు స్కోపున్న పాత్ర కావడంతో పూర్ణగారిని తీసుకున్నాం. లైన్ చెప్పగానే వెంటనే ఓకే చేశారు. బాల్ రెడ్డి, భీమ్స్ సిసిరోలియో గారిలాంటి మంచి టెక్నిషీయన్స్‌ని మా నిర్మాత ఇచ్చారు. కచ్చితంగా ఒక మంచి సినిమా ప్రేక్షకులకు అందిస్తున్నాం అన్న ధీమాతో ఉన్నాం..’’ అన్నారు.
నటి పూర్ణ మాట్లాడుతూ.. ‘‘దర్శకుడు, నిర్మాత ఇద్దరూ ఎంతో అభిరుచి ఉన్న వ్యక్తులు. సెలక్టివ్ గా సినిమాలు చేస్తూ వెళ్తోన్న తరుణంలో ఈ కథ నా దగ్గరకు వచ్చింది. ఇందులో నా క్యారక్టర్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది’’ అన్నారు.
సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో మాట్లాడుతూ.. ‘‘పూర్ణ గారు హీరోయిన్ గా నటించిన సీమటపాకాయ్ చిత్రంలో నేనొక పాట రాశాను. అదే పూర్ణగారు మెయిన్ లీడ్ లో నటిస్తోన్న చిత్రానికి మ్యూజిక్ చేస్తున్నా. చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా విషయానికొస్తే దర్శకుడు క్లారిటీతో ఉన్నారు. పాటలకు మంచి సందర్భాలు ఇస్తున్నారు. నిర్మాత కూడా మ్యూజిక్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీగా రావడానికి సహకరిస్తున్నారు’’ అన్నారు.
పూర్ణ మెయిన్ లీడ్‌లో నటిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: బాల్ రెడ్డి; సంగీతం: భీమ్స్ సిసిరోలియో; స్టోరి డైలాగ్స్: ముద్దు కృష్ణ; పిఆర్ఓ: వంగాల కుమారస్వామి; నిర్మాత: గౌరికృష్ణ; దర్శకత్వం: అన్నం చిన్నికృష్ణ.