బాలీవుడ్‌లో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. అనుష్కశర్మ, విరాట్‌కోహ్లి.. ఇక దీపికాపడుకొనే-రణవీర్‌సింగ్‌లు ఒకటయ్యారు. ప్రియాంకాచోప్రా కూడా తన ప్రియుడు నిక్ జోనాన్‌ని పెళ్లాడనుంది. వీరి నిశ్చితార్ధం ఇటీవల కుటుంబసభ్యుల సమక్షంలో జరిగింది. దీంతో ప్రస్తుతం అందరి చూపు అలియాభట్-రణబీర్‌కపూర్‌ల మీదకి మరలింది. వీరిద్దరు ప్రేమలో ఉన్నారని గత కొంతకాలంగా బాలీవుడ్‌తో పాటు జాతీయ మీడియా కోడై కూస్తోంది. ఈ విషయం గురించి ఇటీవల రణబీర్‌కపూర్ మాట్లాడుతూ, ‘అలియాభట్‌తో నేను ప్రేమలో ఉన్నానని గత కొంతకాలంగా వస్తున్న వార్తలను నేను కూడా విన్నాను. నిజాయితీగా చెప్పాలంటే ఈ విషయంలో నేను దాగుడు మూతలు ఆడటం లేదు. ప్రస్తుతం నేను జీవితంలో అందమైన, సంతోషకరమైన స్థితిలో ఉన్నాను’ అని ఇన్‌డైరెక్ట్‌గా ఈ వ్యాఖ్యలు నిజమేననిపించేలా మాట్లాడాడు.
తాజాగా అలియాభట్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తన అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమె ఫ్యాన్స్ పెళ్లి ఎప్పుడు అని అడిగారు. దానికి ఆమె స్పందిస్తూ, ఎప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను అని మీరు పదే పదే నన్ను ఇదే ఎందుకు అడుగుతున్నారు? కేవలం నాకు పాతికేళ్ల వయసని మీకు తెలుసు. పెళ్లి చేసుకోవడానికి ఇది చాలా చిన్నవయసు అని నా అభిప్రాయం. మరింత వయసు వచ్చిన తర్వాత మాత్రమే ఈ విషయం ఆలోచిస్తాను అని చెప్పింది. నిజంగా పెళ్లికి తొందరెందుకు? అంటూ అబ్బాయిలు, అమ్మాయిలు వయసు వచ్చిన తర్వాతే వివాహం చేసుకుంటే ఆరోగ్యకరంగా ఉంటుందని ప్రభుత్వం చేస్తోన్న ప్రచారాన్ని మాత్రం మన హీరోయిన్లు బాగానే ఫాలో అవుతున్నారు.
ఇక రాష్ట్రపతి, ప్రధానమంత్రిలకి తేడా తెలియకపోయినా కూడా అలియాభట్ ఇలాంటి విషయాలలో మాత్రం మహాగడుసరి అని బాగానే అర్ధమవుతోంది. కాగా ప్రస్తుతం వీరిద్దరు ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో అమితాబ్‌బచ్చన్, నాగార్జున, డింపుల్ కపాడియాలు కీలకపాత్రలను పోషిస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ధర్మప్రొడక్షన్స్ బేనర్‌లో కరణ్‌జోహార్ నిర్మిస్తున్నాడు. వచ్చే ఏడాది క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.