Advertisementt

షాక్: ‘ఆర్ఆర్ఆర్’.. అప్పుడే 500 కోట్లు..!!

Mon 19th Nov 2018 10:19 PM
rrr,pre business buzz,ram charan,500 crore,ss rajamouli,jr ntr  షాక్: ‘ఆర్ఆర్ఆర్’.. అప్పుడే 500 కోట్లు..!!
RRR Movie Pre Business Buzz Shocking షాక్: ‘ఆర్ఆర్ఆర్’.. అప్పుడే 500 కోట్లు..!!
Advertisement
Ads by CJ

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో భారీ చిత్రం #RRR షూటింగ్ ఈరోజు(నవంబర్ 19) నుండి హైదరాబాద్ పరిసరాల్లో స్టార్ట్ అయింది. తారక్ - చరణ్ ఈ సినిమా కోసం కొన్ని రోజులుగా ట్రైనింగ్ తీసుకుంటున్నారు. రాజమౌళి పర్యవేక్షణలో జరుగుతున్న ఈ ట్రైనింగ్ దాదాపు ముగిసినట్లే. ఎందుకంటే చిత్ర రెగ్యులర్ షూట్ కూడా మొదలైంది కాబట్టి.

జక్కన్న ‘బాహుబలి’ తరువాత చేస్తున్న చిత్రం కావడం.. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి. దాంతో ఈసినిమా యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగే సూచనలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ట్రేడ్ సమాచారం ప్రకారం అన్ని భాషల హక్కులు కలుపుకుని 350 కోట్ల వరకు డిమాండ్ ఉంటుందని టాక్.

అలానే శాటిలైట్ మరియు డిజిటల్ హక్కులకు మరో 150 కోట్లు బిజినెస్ జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. టోటల్ గా ఈసినిమా 500 కోట్లు బిజినెస్ ఖాయం అని చెబుతున్నారు ట్రేడ్ వారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈచిత్రంలో ఎన్టీఆర్ - రామ్ చరణ్ చాలా కొత్తగా కనిపించబోతున్నారట. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ మూవీని నిర్మిస్తున్నారు.

RRR Movie Pre Business Buzz Shocking:

Shocking Business to RRR

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ