రాజమౌళి - రామారావు - రామ్ చరణ్ ల మల్టీస్టారర్ ఆఫీషియల్ గా నవంబర్ 11 నే మొదలైంది. భారీ అంచనాలున్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్‌ని కూడా మొదలేట్టేశారు. ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి ఒకే ఫ్రేమ్‌లో చూడడానికే రెండు కళ్ళు చాలవు.. అలాంటిది వారు ముగ్గురు ఒకే సినిమా కోసం పనిచెయ్యడం అంటే టాలీవుడ్ సినీప్రియులకు పండగే. మరి రాజమౌళి ఎలాంటి కథతో చరణ్ అండ్ ఎన్టీఆర్ లను కనెక్ట్ చేసాడో క్లారిటీ రావడం లేదు గాని.. ఇద్దరు హీరోలను ఎలా చూపించాలో రాజమౌళి అలా చూపించడం ఖాయంగా తెలుస్తుంది. రాజమౌళి డైరెక్షన్ లో ఉన్న సత్తా... ఎన్టీఆర్, రామ్ చరణ్ క్రేజ్ ఈ భారీ మల్టీస్టారర్ పై భారీ అంచనాలు ఏర్పడేలా చేసింది.
అయితే ఇప్పటివరకు రాజమౌళి హీరోయిన్స్ విషయంలో ఎటువంటి క్లారిటీ ఇవ్వడం లేదు. ఎందుకంటే మొదటి షెడ్యూల్ లో హీరోలతో భారీ యాక్షన్ సీక్వెన్సెస్ ని చిత్రీకరిస్తాడట. అందుకే హీరోయిన్స్ ఎంపికకి కాస్త సమయం తీసుకోనున్నాడు. తాజాగా ఇద్దరు స్టార్ హీరోలైన ఎన్టీఆర్, చరణ్ లతో రాజమౌళి RRR షూటింగ్ మొదలు పెట్టేసాడు. ముగ్గురూ కలిసి సైలెంట్ గా సెట్స్ మీదకెళ్లడమే కాదు... ముగ్గురూ కలిసి ఒక స్టిల్ కి ఫోజ్ కూడా ఇచ్చారు. ఇద్దరు హీరోలతో రాజమౌళి ఉన్న ఈ RRR వర్కింగ్ స్టిల్ క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరి రాజమౌళి ఈ సినిమాని ఎన్ని భాషల్లో విడుదల చేస్తాడో గాని.. అన్ని భాషల బడా నిర్మాణ సంస్థలు అప్పుడే ఈ RRR పై కన్నేసినట్లుగా తెలుస్తుంది.
మరి అనుకున్న టైమ్‌కే రంగంలోకి దిగిన ఈ RRR బ్యాచ్ అనుకున్న టైమ్‌కే సినిమాని ప్రేక్షకుల ముందుకు తెచ్చేలాగే కనబడుతుంది. ఇకపోతే రాజమౌళి ఈ సినిమా కోసం ఎన్టీఆర్‌ని కండలు తిరిగిన దేహంతో చూపించబోతుంటే.. రామ్ చరణ్ మాత్రం న్యూ లుక్ లోకి రాబోతున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్‌కి, రామ్ చరణ్‌కి సెపరేట్‌గా ట్రైనర్లని కూడా పంపిన రాజమౌళి RRR కోసం ఇద్దరి హీరోల రూపురేఖలను మార్చేయబోతున్నాడు. అయితే తాజాగా రాజమౌళి RRR రెగ్యులర్ షూటింగ్ మొదలైన సందర్భంగా దిగిన పిక్ లో చరణ్ అండ్ ఎన్టీఆర్ ల లుక్స్ లో గెడ్డం తప్ప పెద్దగా కొత్తదనం అయితే కనిపించడం లేదు. ఆ ఫొటోలో ఎన్టీఆర్ అండ్ చరణ్ లు రాజమౌళిపై చెయ్యి వేసి కూర్చోగా వెనకాల RRR షూటింగ్ కోసం భారీ ఎత్తున రంగంలోకి దిగడం కోసం పెద్ద పెద్ద క్రేన్స్ కనబడుతున్నాయి. మరి RRR బ్యాచ్ యుద్దానికి సిద్ధమైందన్నమాట.