Advertisementt

ప్రీ రిలీజ్ కాదు.. సక్సెస్ మీట్‌లా ఉందట!!

Sun 18th Nov 2018 07:30 PM
24 kisses,movie,pre release,event  ప్రీ రిలీజ్ కాదు.. సక్సెస్ మీట్‌లా ఉందట!!
24 Kisses Movie Pre Release Event ప్రీ రిలీజ్ కాదు.. సక్సెస్ మీట్‌లా ఉందట!!
Advertisement
Ads by CJ

హెబ్బా పటేల్, అరుణ్ ఆదిత్ జంటగా నటించిన చిత్రం ‘24 కిస్సెస్’ ‘నీకో సగం.. నాకో సగం.. ఈ ఉత్సవం’ అన్నది టాగ్ లైన్..  ‘మిణుగురులు’ లాంటి అవార్డ్ విన్నింగ్ చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడు అయోధ్య కుమార్ కృష్ణంశెట్టి ఈ సినిమాకి దర్శకత్వం వహించగా సిల్లీమొంక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, రెస్పెక్ట్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై  సంజయ్ రెడ్డి, అనిల్ పల్లెల, అయోధ్య కుమార్ కృష్ణంశెట్టి లు ఈ సినిమాని నిర్మించారు.. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక నిన్న హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ఆనలుగురు ఫేమ్ చంద్రసిద్ధార్థ్, నటుడు నరేష్, మంచు లక్ష్మి, హీరో నవీన్ చంద్ర, హీరో నవదీప్, హీరో సిద్ధూ జొన్నలగడ్డ, సందీప్ కిషన్, ప్రవీణ్ సత్తారులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.. ఈ సందర్భంగా మంచు లక్ష్మి గారి చేతుల మీదుగా ఆడియోని లాంచ్ చేశారు.. 

దర్శకుడు చంద్ర సిద్ధార్థ్ మాట్లాడుతూ.. మిణుగురులాంటి అంతర్జాతీయ స్థాయి సినిమా తీసిన అయోధ్య నెక్స్ట్ ఏంటి అంటే 24 కిస్సెస్.. ఈ 24 కిస్సెస్ వెనుక 24 కారణాలుంటాయని. 24 క్రాఫ్ట్స్ వాడుకుని చాలా కళాత్మకంగా సినిమా తీశాడని నమ్ముతున్నాను.. సినిమాని నిర్మించిన ప్రొడ్యూసర్స్ కి, హీరో హీరోయిన్స్ కి అందరికి ఆల్ ది బెస్ట్.. అన్నారు.. 

నిర్మాత కిషోర్ మాట్లాడుతూ.. సినిమాని బ్లెస్స్ చేయడానికి వచ్చిన అందరికి చాలా థాంక్స్.. ఈ వన్ ఇయర్ జర్నీ చాలా వండర్ ఫుల్ గా జరిగింది.. అందరూ గర్వపడేలా ఈ సినిమా ఉంటుంది.. బోల్డ్ సినిమాలా కాదు మంచి ఫీల్ సినిమా ఇది.. మాతో అసోసియేట్ అయిన సిల్లీ మొంక్స్ వారికి చాలా థాంక్స్.. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది.. అన్నారు.. 

మంచు లక్ష్మి మాట్లాడుతూ.. 24 కిస్సెస్ సినిమా ఆడియో లాంచ్ కి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.. విజువల్స్ చాలా బాగున్నాయి.. డైరెక్టర్ గారికి చాలా అవార్డ్స్ వచ్చాయి.. ఆయనకి ఇప్పుడు మరిన్ని అవార్డ్స్ రావాలని కోరుకుంటున్నాను.. 23 న ఈ సినిమా రాబోతుందని.. అందరూ చూసి ఈ సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నాను.. అన్నారు..

సందీప్ కిషన్ మాట్లాడుతూ.. సినిమా ట్రైలర్ చాలా బాగుంది.. ప్రొడ్యూసర్స్ గారు మంచి సినిమా చేస్తున్నారు.. ఈ సినిమా తప్పకుండా హిట్ అయ్యి వారికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను.. అన్నారు.. 

నటుడు నరేష్ మాట్లాడుతూ.. మిణుగురులు చూశాను.. చాలా బాగుంది.. డైరెక్టర్ కి ఫ్యాన్ అయిపోయాను.. ఈ సినిమాని ఇంత బాగా నిర్మించిన ప్రొడ్యూసర్స్ కి ఆల్ ది బెస్ట్.. ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా చాలా లావిష్ గా తీశారు.. ఈ సినిమా తప్పకుండా హిట్ అవ్వాలని, అవుతుందని ముందుగానే అందరికి హార్టీ కంగ్రాచ్యులేషన్స్ అన్నారు.. 

హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ.. సినిమా గురించి చాలా విన్నాను.. టైటిల్ చాలా బాగుంది.. టైటిల్ కి తగ్గట్లు హీరో హీరోయిన్స్ అంతా మర్చిపోయి అలా నటించడం గొప్ప విషయం.. డైరెక్టర్ గారు మంచి డెడికేషన్ తో సినిమా తీశారు.. ఇది బోల్డ్ ఫిలిం అని అనట్లేదు.. ఎమోషన్ ఉన్న సినిమా.. ఈ సినిమాని మీరందరూ తప్పకుండా ఆదరిస్తారని కోరుకుంటూ సినిమా టీంకి ఆల్ ది బెస్ట్ అన్నారు.. 

నిర్మాత మధుర శ్రీధర్ మాట్లాడుతూ.. విజువల్స్ చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది.. అయోధ్య కుమార్ జర్నీ నాకు తెలుసు.. మిణుగురులు తర్వాత సినిమాపై తన తపన ఏంటో నాకు తెలుసు.. 24 కిస్సెస్.. మంచి ఎమోషన్ ఉన్నసినిమా. ప్రొడ్యూసర్ చాలా బాగా తీశారు.. రాబోయే ఫిలిం మేకర్స్ కి ఈ సినిమా మంచి ఉదాహరణ అవుతుంది.. హీరో హీరోయిన్స్ ఇద్దరు బాగా యాక్ట్ చేశారు.. ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు..

దర్శకుడు అయోధ్య కుమార్ మాట్లాడుతూ.. మిణుగురులు సినిమా చేసినప్పుడు కంటే ఆ సినిమా బాగుందని చెప్పినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది.. ఆ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.. ఈ సినిమా జర్నీ 2016 లో స్టార్ట్ అయ్యింది.. ఈ సినిమాని బోల్డ్ సినిమాగా కాకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాగా గుర్తిస్తున్నారు.. రియల్ టాలెంట్ ని గుర్తించడంలో ప్రొడ్యూసర్స్ మంచి పేరుంది.. నాకు అవకాశం ఇచ్చిన వారికి చాలా థాంక్స్.. ఈ సినిమాకి పనిచేసిన అందరూ నిజాయితీగా చాలా కష్టపడి పనిచేశారు.. ఈ సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు..

నటుడు శశాంక్ మాట్లాడుతూ.. టైటిల్ చాలా క్యాచీగా ఉంది.. సినిమా ట్రైలర్, టీజర్ చూశాక నా అభిప్రాయం మార్చుకున్నాను. కంటెంట్ ఉన్న సినిమా ఇది.. రిలీజ్ తర్వాత ఈ సినిమా గురించి తప్పకుండా మాట్లాడుకుంటారు.. సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటూ చిత్ర టీంకి ఆల్ ది బెస్ట్ అన్నారు..

హీరోయిన్ హెబ్బా పటేల్ మాట్లాడుతూ.. ఈ ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ గారికి చాలా థాంక్స్.. ప్రొడ్యూసర్స్ కి వెరీ వెరీ థాంక్స్.. ఈ సినిమా చాలా బాగుంటుంది..నా కెరీర్ కి ఈ సినిమా చాలా బాగా ఉపయోగపడుతుంది.. 23 న సినిమా రిలీజ్ అవబోతుంది.. ఈ సినిమాని మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను.. అన్నారు..

హీరో అరుణ్ ఆదిత్ మాట్లాడుతూ.. ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్ లా లేదు.. సక్సెస్ మీట్ లా ఉంది.. ఈ సినిమాలో మంచి కంటెంట్ ఉంది.. తప్పకుండా చూడండి.. ఇంత మంచి కథకి నన్ను సెలెక్ట్ చేసిన డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ కి చాలా థాంక్స్.. సినిమాలోని ప్రతి సీన్ ని ఇంట్రెస్ట్ తో మంచి వర్క్ చేశాం.. ఈ సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు..

24 Kisses Movie Pre Release Event:

Celebrities Speech at 24 Kisses Pre Release Event

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ