Advertisementt

ఈసారి చరణ్.. జిగేల్ రాణి ఎవరో తెలుసా?

Sun 18th Nov 2018 05:14 PM
rakul preet singh,ram charan,vinaya vidheya rama,item song  ఈసారి చరణ్.. జిగేల్ రాణి ఎవరో తెలుసా?
Heroine Fixed for Vinaya Vidheya Rama movie Item Song ఈసారి చరణ్.. జిగేల్ రాణి ఎవరో తెలుసా?
Advertisement
Ads by CJ

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వినయ విధేయ రామ’. ఈ చిత్ర ఫస్ట్ ‌లుక్, టీజర్ ఇటీవలే విడుదలై సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా.. అనేలా మెగాభిమానులను టీజర్‌లోని ఒకే ఒక్క డైలాగ్‌తో ఊరించేశాడు. రామ్.. కొ.ణి.దె.ల అంటూ రామ్ చరణ్ చెప్పిన డైలాగ్.. మెగాభిమానులకు పిచ్చపిచ్చగా కిక్కును ఎక్కించేసింది. టీజర్ విడుదల తర్వాత మెగాభిమానుల ముఖచిత్రాలు ఆనందంతో వెలిగిపోయాయంటే అతిశయోక్తి లేదు.

ఇక విషయంలోకి వస్తే.. రామ్ చరణ్‌కి కెరీర్‌లోనే టాప్ చిత్రంగా నిలిచిన రంగస్థలం చిత్రంలో ‘జిగేల్‌రాణి’ పాట ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు కూడా అలాంటి పాటే ‘వినయ విధేయ రామ’లో ఉండబోతోందని, ఆ పాటలో నర్తించేందుకు బాలీవుడ్ హీరోయిన్‌ను తీసుకువస్తున్నారని రీసెంట్‌గా వార్తలు వినిపించాయి. అయితే ఈ పాటలో నటించే హీరోయిన్ బాలీవుడ్ ఫిగర్ కాదని, చరణ్‌తో బ్రూస్‌లీ, ధృవ చిత్రాలలో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ అని తాజాగా వార్తలు బయటికి వచ్చాయి.

‘జిగేల్ రాణి’గా పూజా హెగ్డే‌కి పేరు పడిపోయింది. అంతగా ఆ పాట ఆమెకు పేరు తెచ్చింది. ఇప్పుడు ‘మామా మియా’ అంటూ సాగే పాటలో రకుల్ ఎలాంటి పేరును తెచ్చుకుంటుందో చూడాలి. అయితే రకుల్ అనగానే కాస్త నెగిటివ్ టాక్స్ కూడా వినిపిస్తుండటం విశేషం. ఈ మధ్య మరీ పీలగా కనిపిస్తున్న రకుల్‌ని ఈ పాట కోసం తీసుకోవడం ఏమిటని, మళ్లీ పూజానే తీసుకుంటే బాగుంటుందని కొందరు మెగాభిమానులు సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తుండటం గమనార్హం. 

Heroine Fixed for Vinaya Vidheya Rama movie Item Song:

Rakul Preet Singh for Vinaya Vidheya Rama Item Song

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ