Advertisementt

తమన్నాకి తెగ నచ్చేసిందట..!!

Sat 17th Nov 2018 06:18 PM
next yenti,next enti movie,tamanna,sundeep kishan,navdeep,kunal kohli  తమన్నాకి తెగ నచ్చేసిందట..!!
Next Yenti Trailer Released తమన్నాకి తెగ నచ్చేసిందట..!!
Advertisement
Ads by CJ

తమన్నా, సందీప్ కిషన్‌ల ‘నెక్స్ట్ ఏంటి’ ట్రైలర్ లాంచ్ వేడుక..!!

తమన్నా, సందీప్ కిషన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘నెక్స్ట్ ఏంటి’. బాలీవుడ్ టాప్ దర్శకుడు కునాల్ కోహ్లీ దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నవదీప్, పూనమ్ కౌర్‌లు ముఖ్యపాత్రల్లో నటిస్తుండగా, ఇటీవలే ఫస్ట్ లుక్‌ని, టీజర్‌ని రిలీజ్ చేశారు. టీజర్ కి మంచి రెస్పాన్స్ రాగా తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమం హైదరాబాద్‌లో జరగగా దర్శకుడు కునాల్ కోహ్లీ, సందీప్ కిషన్, నవదీప్, తమన్నా, సంగీత దర్శకుడు లియోన్ జేమ్స్ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా దర్శకుడు కునాల్ కోహ్లీ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా స్క్రిప్ట్‌ను ఫస్ట్ నేను శరత్ బాబు గారికి పంపాను. అయన ఎంతో థ్రిల్ గా ఫీల్ అయ్యి నన్ను హైదరాబాద్‌కి రమ్మన్నారు. ఫాదర్ అండ్ డాటర్ మధ్య సీన్స్ చాలా బాగున్నాయన్నారు. ఇండియాన్ కల్చర్ ని తెలిపే సినిమా ఇది. ఒక సినిమాకి భాష ఇబ్బంది కాదు. ఏ భాషలోనైనా సినిమా బాగుంటే ఆడుతుంది..’’ అన్నారు.

హీరో నవదీప్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో నన్ను సెలెక్ట్ చేసినందుకు కునాల్ గారికి చాలా థ్యాంక్స్. ఈ సినిమాలో తమన్నా డబ్బింగ్ బాగుంది. తన హార్డ్ వర్క్ చాలా బాగుంది. సందీప్ చాలా బాగా యాక్ట్ చేశాడు. ఈ సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. సినిమా ట్రైలర్‌లో ఉన్న కంటెంట్ వేరు సినిమాలో ఉన్న ఫీల్ వేరు. యూత్‌ని ఆకట్టుకోవాలని అలా ట్రైలర్ కట్ చేసారు. ఈ సినిమా అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను..’’ అన్నారు.

హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. ‘‘ముందుగా కునాల్ గారు దర్శకుడు అనగానే బాలీవుడ్ సినిమా అనుకున్నాను. కానీ తర్వాత తెలిసింది తెలుగు సినిమా అని. కథ వినగానే ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. సినిమాలోని నా లుక్ చాలా బాగుంది. కునాల్ గారు నన్ను హీరోగా తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్. నా పాత్ర బాగుందంటే అది కునాల్ క్రెడిట్. మ్యూజిక్ చాలా బాగుంది. నేను వర్క్ చేసిన ప్రొడ్యూసర్స్ లో నాకు చాలా బాగా నచ్చిన ప్రొడ్యూసర్ కిరణ్ గారు. ఆ తర్వాత నేను బాగా కంఫర్ట్ ఫీల్ అయిన ప్రొడ్యూసర్స్ అక్షయ్ గారు. తమన్నాతో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది..’’ అన్నారు. 

హీరోయిన్ తమన్నా మాట్లాడుతూ.. ‘‘తెలుగు సినిమా రోజురోజుకి చేంజ్ అయిపోతుంది. ఈ సినిమాలు ఇండియా మొత్తం తెలిసిపోతున్నాయి. నేను ముంబైలో పుట్టినా తెలుగు సినిమా నాకు చాలా ముఖ్యం. కునాల్ గారికి బిగ్  వెల్ కం. మీరు మీ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వాలని కోరుకుంటున్నాను. సూపర్ హిట్స్ చేయాలనీ కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటి సినిమా కథ విన్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఇందులో నా క్యారెక్టర్ నేనే ప్లే చేస్తున్నానా అనిపించింది. సందీప్‌తో యాక్ట్ చేయడం చాలా బాగా అనిపించింది. నవదీప్ కళ్ళతో నటించే యాక్టర్. వారితో పనిచేయడం కొత్తగా అనిపించింది. సినిమా మొత్తం చాలా ఎంజాయ్ చేస్తూ చేసాం. డిసెంబర్ లో ఈ సినిమా వస్తుంది. అందరు తప్పక ఆదరించాలి’’ అన్నారు.

నటీనటులు:  తమన్నా భాటియా, సందీప్ కిషన్, నవదీప్, శరత్ బాబు, పూనమ్ కౌర్, లారిస్సా

సాంకేతిక నిపుణులు :

దర్శకుడు: కునాల్ కోహ్లీ

నిర్మాతలు: రైనా జోషి, అక్షయ్ పూరి

సినిమాటోగ్రఫీ: మనీష్ చంద్ర భట్

సంగీతం: లియోన్ జేమ్స్

సాహిత్యం రామజోగయ్య శాస్త్రి

ప్రొడక్షన్ డిజైన్: కిర్ స్టెన్ బ్రూక్  (UK)

డైలాగ్స్: గోపు కిషోర్ రెడ్డి

సౌండ్ డిజైన్: దారా సింగ్

అసోసియేట్ ప్రొడ్యూసర్ : సతీష్ సాల్వి, సంజన చోప్రా

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : షాజహాన్, శివప్రసాద్ గుడిమిట్ల 

PRO: వంశీ-శేఖర్

రిలీజ్ : శ్రీ కృష్ణ క్రియేషన్స్

Next Yenti Trailer Released :

Next Yenti Trailer Release Event Highlights

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ