ఈ శుక్రవారం రవితేజ - శ్రీను వైట్ల కాంబోలో తెరకెక్కిన అమర్ అక్బర్ ఆంటోని సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తే... దానికి పోటీగా.. ఈ శనివారం అంటే ఈ రోజు విజయ్ దేవరకొండ తన టాక్సీవాలా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే ఈ రెండు సినిమాలకు ఒకే రకమైన అంచనాలు ప్రేక్షకులలోనూ, అలాగే ట్రేడ్‌లోనూ ఉన్నాయి. ఎందుకంటే రవితేజ వరుస ప్లాప్స్ తో ఉన్నాడు. ఇక శ్రీను వైట్ల కూడా అంతే. ఇక విజయ్ దేవరకొండకి గీత గోవిందం ఇచ్చిన బూస్ట్ కాస్తా నోటాతో పోవడమే కాదు... టాక్సీవాలా మీద మొదటి నుండి అంచనాలు ఉన్నా.. మూవీ మొత్తం పైరసీలో బయటికి వచ్చేయడంతో అప్పటి వరకు మూవీపై ఉన్న క్రేజ్ మొత్తం పోయింది. మరి ఈ రెండు సినిమాలు ఒకదాని మీద ఒకటి పోటీకి దిగాయి. అయితే నిన్న విడుదలైన రవితేజ అమర్ అక్బర్ ఆంటోని సినిమాకి మిక్స్డ్ టాక్ అనేకన్నా డివైడ్ టాక్ వచ్చింది అంటేనే బెటర్. ఎందుకంటే అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో కథ కాదు కదా స్క్రీన్‌ప్లే కూడా ఆకట్టుకునేలా లేదంటున్నారు. ఇక రవితేజ అమర్ గా అల్లాడించినా... ఆంటోని, అక్బర్ పాత్రల్లో అస్సలు ఆకట్టుకోలేదంటున్నారు.
శ్రీను వైట్ల డైరెక్షన్‌ని, స్క్రీన్‌ప్లే ని ఆడుకుంటున్నారు. ఇంకా శ్రీను వైట్ల సినిమాల్లో వుండే కామెడీ ఈ అమర్ అక్బర్ ఆంటోని లో మిస్ అయ్యిందని... ఆగడు దగ్గర స్టార్ట్ అయిన శ్రీను వైట్ల ప్లాప్ పరంపర ఇప్పుడు అమర్ అక్బర్ ఆంటోని వరకు కొనసాగిందనే చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకి పబ్లిసిటీ భీభత్సంగా చేసినా... ఉపయోగం లేకుండా పోయింది. ఇక రివ్యూ రైటర్స్ కూడా అందరు అనుకున్నట్టుగా అమర్ అక్బర్ ఆంటోనికి ప్లాప్ రేటింగ్ ఇచ్చారని కూడా అంటున్నారు. మరి సినిమాలో విషయముంటే సినిమాకి పాజిటివ్ పాయింట్స్ ఇస్తారు కానీ... అమర్ అక్బర్ ఆంటోని ప్లస్ పాయింట్స్ లో కేవలం మైత్రి వారి నిర్మాణ విలువలు తప్ప మరేం లేదంటేనే అమర్ అక్బర్ ఆంటోని సినిమా పరిస్థితి ఏమిటో అర్ధమవుతుంది.
మరి ఈ అమర్ టాక్ ఇప్పుడు టాక్సీవాలాకి పనికొచ్చేలానే ఉంది. విజయ్ దేవరకొండ ప్రమోషన్స్, స్పెషల్ థ్రిల్లింగ్ సబ్జెక్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో కామెడీ కూడా పుష్కలంగా ఉంటుందని విజయ్ చేసే ప్రమోషన్స్, అలాగే హీరోయిన్ ప్రియాంక కూడా టాక్సీవాలా ప్రమోషన్స్ లో చేసే హడావిడి..ఈ అమర్ అక్బర్ ఆంటోని డివైడ్ టాక్ అన్ని విజయ్ దేవరకొండకి కలిసొచ్చి సినిమా గనక కాస్త యావరేజ్ టాక్ పడినా విజయ్ దేవరకొండ క్రేజ్ తో సినిమా లేచే అవకాశం ఉంది. చూద్దాం టాక్సీవాలా టాక్ ఏమిటో మరికొద్ది గంటల్లోనే తెలిసిపోతుందిలే.