రౌడీ హీరో విజయ్ దేవరకొండను స్టార్‌ని చేసింది ఎవరయ్యా అంటే.. ఖచ్చితంగా అందరూ ‘అర్జున్‌రెడ్డి’ పేరే చెబుతారు. పెళ్లి చూపులు చిత్రంతో హిట్టయితే వచ్చింది కానీ స్టార్‌డమ్ మాత్రం ‘అర్జున్‌రెడ్డి’ చిత్రమే ఇచ్చింది విజయ్ దేవరకొండకి. ఆ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ యూత్‌కి మెగాస్టార్ అయిపోయాడంటే అతిశయోక్తి కాదు. ఒక్కసారిగా విజయ్ లైఫే మారిపోయింది. మరీ ముఖ్యంగా తెలంగాణలో విజయ్ అంటే కోసేసుకునే స్థాయికి ఆయన స్టార్‌డమ్ ఉందంటే అందరూ నమ్మాలి మరి. దీనికి తగ్గట్టుగానే ఆ సినిమా తర్వాత వచ్చిన ‘గీతగోవిందం’ చిత్రం విజయ్‌ని మరోస్థాయిలో నిలబెట్టింది.
ఇక అర్జున్ రెడ్డి చిత్రం ఇప్పుడు తమిళ్, బాలీవుడ్‌లో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. తమిళ్‌లో వర్మ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా నటిస్తున్నాడు. కాగా సంచలన దర్శకుడు బాలా ఈ చిత్రానికి దర్శకుడు. ఇక బాలీవుడ్ అర్జున్ రెడ్డిని తెలుగులో అర్జున్ రెడ్డి చిత్రం చేసిన సందీప్ వంగానే ‘కబీర్ సింగ్’ అనై టైటిల్‌తో రీమేక్ చేస్తున్నారు. ఇందులో షాహిద్ కపూర్ హీరోగా చేస్తున్నాడు. ఈ బాలీవుడ్ అర్జున్ రెడ్డి గురించి మన టాలీవుడ్ అర్జున్ రెడ్డి అదేనండి విజయ్ దేవరకొండ తాజాగా స్పందించాడు.
‘‘కబీర్ సింగ్ పేరు చాలా బాగుంది. తెలుగులో ‘అర్జున్ రెడ్డి’ అనే టైటిల్ ప్రకటించగానే అందరూ ఇదేదో ఫ్యాక్షన్ చిత్రం అనుకున్నారు. తెలుగులో ఎంత పెద్ద విజయం సాధించిందో బాలీవుడ్‌లో కూడా ఈ చిత్రం అంతే విజయం సాధిస్తుందనే నమ్మకం నాకుంది. ఈ చిత్రంతో సందీప్ అక్కడ కూడా తన సత్తా చాటుతాడని నేను నమ్ముతున్నాను. టీజర్ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుంతా అని ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను. భారీ విజయంతో మరోసారి ‘అర్జున్ రెడ్డి’ పేరు మారుమోగుతుందని.. గట్టిగా చెబుతున్నాను..’’ అంటూ విజయ్ దేవరకొండ తెలిపాడు.