Advertisementt

‘కవచం’ విడుదల తేదీ ఫిక్స్ చేశారు

Sat 17th Nov 2018 01:25 PM
sai srinivas,kajal,kavacham movie,release,dec 7  ‘కవచం’ విడుదల తేదీ ఫిక్స్ చేశారు
Kavacham Movie Release Date Fix ‘కవచం’ విడుదల తేదీ ఫిక్స్ చేశారు
Advertisement
Ads by CJ

డిసెంబర్ 7 న విడుదల కాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్ ‘కవచం’

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న ‘కవచం’ సినిమా డిసెంబర్ 7న రిలీజ్ కాబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఇటీవలే రిలీజ్ అయిన టీజర్‌కి 9 మిలియన్ వ్యూస్‌తో అద్భుతమైన స్పందన రాగా, సినిమాపై అంచనాలను పెంచేసింది. థ్రిల్లర్ సినిమా‌గా వస్తున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ళ దర్శకత్వం వహించారు. మెహ్రీన్ మరో కథానాయికగా నటిస్తుండగా హర్షవర్ధన్ రాణే, బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయ్యింది. ఎస్.ఎస్. థమన్ సంగీతం సమకూరుస్తుండగా, చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. వంశధార క్రియేషన్స్ బ్యానర్‌పై నవీన్ సొంటినేని (నాని) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, మెహ్రీన్ పిర్జాదా, నీల్ నితిన్ ముఖేష్, హర్షవర్ధన్ రానే, పోసాని కృష్ణ మురళి, సత్యం రాజేష్ మరియు అపూర్వ

సాంకేతిక నిపుణులు : డైరెక్టర్ : శ్రీనివాస్ మామిళ్ళ, నిర్మాత : నవీన్ సొంటినేని(నాని), బ్యానర్ : వంశధార క్రియేషన్స్, సహా నిర్మాత: చాగంటి సంతయ్య, మ్యూజిక్ : ఎస్.ఎస్.థమన్, ఛాయాగ్రహణం : చోటా.కె. నాయుడు, ఎడిటర్ : చోటా కె ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్ : చిన్నా, PRO : వంశీ - శేఖర్

Kavacham Movie Release Date Fix:

Kavacham Movie Release on DEC 7

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ