ఒకప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఎదురెళ్లి నిలబడే సినిమా ఉండేది కాదు. ఎందుకంటే రజినీకాంత్ సినిమాలకుండే క్రేజ్ అలాంటిది. సూపర్ స్టార్ సినిమాలు విడుదలవుతున్నాయి అంటే ఆఫీస్ లకు సెలవలు ప్రకటించే సిటీస్ కూడా ఉన్నాయంటే రజినికున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో తెలుస్తుంది. అయితే గత కొన్నాళ్లుగా అంటే రోబో సినిమా హిట్ తర్వాత రజిని నటించిన సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి. లింగా, కాలా, కబాలి ఇలా అన్ని వరుసగా డిజాస్టర్స్ అవుతున్నాయి. అయితే ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రజిని హీరోగా వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 2.ఓ పై మాత్రం భారీ అంచనాలున్నాయి. అయితే ఆ సినిమా మీద టెక్నికల్‌గా అంటే శంకర్ డైరెక్షన్ మీద కూడా భారీగా అంచనాలుండడం, అక్షయ్ కుమార్ విలన్ గా రజినీకాంత్ చిట్టి రోబోగా కనబడనున్న ఈ సినిమాపై ఇండియా వైడ్ గా అయితే అంచనాలున్నాయి.
కానీ రజినీకాంత్, కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న ‘పెట్టా’ మీద అయితే అంత భారీ అంచనాలేమి లేవు. అందుకే రజినీకాంత్ సినిమా ‘పెట్టా’ సంక్రాంతికి విడుదలని ప్రకటించినా అక్కడ అజిత్ ‘విశ్వాసం’ సినిమా నిర్మాతలు గాని.. ఇక్కడ తెలుగులో రామ్ చరణ్ - బోయపాటి ‘వినయ విధేయ రామ’ నిర్మాతలు గాని బెదరడం లేదు. అలాగే బాలకృష్ణ, క్రిష్ లు కూడా రజినీకాంత్ సినిమా ‘పెట్టా’ సంక్రాంతికే విడుదలని ప్రకటించినా ఎలాంటి కంగారు పడడం లేదు. క్రిష్ - బాలయ్య కాంబోలో వస్తున్న ఎన్టీఆర్ కథానాయకుడు టీం కూడా కూల్ గానే ఉంది.
మరి వీళ్ళందరూ అంత కూల్ గా ఉండడానికి కారణం మాత్రం రజిని సినిమాలకున్న క్రేజ్ తగ్గడమేనా..? ఏమో కానీ ఒక్క నిర్మాత మాత్రం కాస్త టెంక్షన్ పడుతున్నాడు. ఆయనెవరో కాదు దిల్ రాజు. అసలే ‘కథానాయకుడు, వినయ విధేయ రామ, విశ్వాసం’ ని తట్టుకుని నిలబడాలి అనుకున్న దిల్ రాజుకి ఇప్పుడు మాత్రం కాస్త రజిని ‘పెట్టా’ టెంక్షన్ మాత్రం పట్టుకుంది అంటున్నారు. ఎందుకంటే దిల్ రాజు నిర్మాతగా వెంకీ - వరుణ్ ల ‘ఎఫ్ 2’ కూడా సంక్రాంతికే రాబోతుంది కదా అందుకు.