Advertisementt

నాని, శౌర్య చెప్పినంత బ్యాడ్ కాదా సాయిపల్లవి!!

Fri 16th Nov 2018 04:39 PM
saipallavi,good artist,sharwanand,padi padi leche manasu  నాని, శౌర్య చెప్పినంత బ్యాడ్ కాదా సాయిపల్లవి!!
Sharwanand Praises Saipallavi నాని, శౌర్య చెప్పినంత బ్యాడ్ కాదా సాయిపల్లవి!!
Advertisement
Ads by CJ

సాయిపల్లవి ఒక సినిమా ఒప్పుకుందీ అంటే.. ఆ సినిమా విజయం సాధించకపోయినా.. అందులో ఎంతో కొంత మ్యాటర్ అయితే ఉండే ఉంటుందని.. ఇప్పటి వరకు ఆమె చేసిన సినిమాలను చూస్తే తెలుస్తుంది. ఈ మధ్య తెలుగులో ఆమెపై కొన్ని రూమర్లు వినిపించినా.. అవకాశాలు మాత్రం ఆమెకు వస్తూనే ఉన్నాయి. నేచురల్ బ్యూటీగా పేరున్న సాయిపల్లవి.. ప్రస్తుతం శర్వానంద్ సరసన ‘పడిపడి లేచె మనసు’ చిత్రంలో చేస్తుంది. ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. డిసెంబర్ 21 ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇక విషయంలోకి వస్తే.. యంగ్ హీరోలు నాని, నాగశౌర్యల విషయంలో ఇటీవల సాయిపల్లవిపై అనేక రూమర్లు వినిపించిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఆ రూమర్లు అని కొట్టిపడేయడానికి వీలు లేకుండా నాని, శౌర్యలు కూడా సాయిపల్లవి తీరు గురించి డైరెక్ట్‌గానే ఓపెన్ అయ్యారు. దీంతో ఈ అమ్మడు పని అయిపోయిందని అంతా అనుకున్నారు కానీ ఇప్పుడు శర్వానంద్‌.. ఆమెపై చేసిన కామెంట్స్ వింటే.. తప్పు సాయిపల్లవిది కాదేమో అనేలా అనిపించకమానదు.

‘‘సాయిపల్లవి చాలా మంచినటి. స్ర్కిఫ్ట్‌ని అర్ధం చేసుకుని నటించే హీరోయిన్లలో ఆమెకు అగ్రస్థానం ఇవ్వవచ్చు. ఇంకా చెప్పాలంటే సాయిపల్లవి చాలా తెలివిగల హీరోయిన్. ఆమెతో మరో సినిమా నటించాలనిపించేంతగా ఆమె ఈ చిత్రంలో నటించారు. ఆమె నటనకు మంచి మార్కులు పడతాయి..’’ అని ఇటీవల షూటింగ్ పూర్తయిన సందర్భంగా శర్వానంద్.. సాయిపల్లవి గురించి తెలిపాడు. దీనిని బట్టి.. చూస్తే.. అప్పట్లో నాని, శౌర్య చేసిన కామెంట్స్ సాయిపల్లవికి వర్తించవని మాత్రం చెప్పవచ్చు.

Sharwanand Praises Saipallavi:

Saipallavi A good Artist, says Sharwanand

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ