బిగ్ బాస్ 2 విన్ అవ్వగానే ఏదో ప్రపంచాన్ని జయించినట్టుగా తెగ హడావిడి చేశాడు కౌశల్. బిగ్ బాస్ 2 నుండి టైటిల్ విన్ అయ్యి బయటికి రాగానే కొన్ని టీవీ ఛానల్స్ లో చాలా అతిశయోక్తిగా మాట్లాడాడు. ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి తనకు ఫోన్ వచ్చిందని...గిన్నిస్ బుక్ వారు తనను సంప్రదించబోతున్నారని.. తనకి 40 కోట్ల ఓట్లు వచ్చాయని ఇలా ఇష్టమొచ్చినట్టు చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్‌కి గురయ్యాడు.
తనకు ప్రధాన మంత్రి కార్యాలయం నుండి ఫోన్ వచ్చిందని అయితే ఆ సమయంలో తను ఇంట్లో లేకపోవడంతో మా డాడీ ఫోన్ మాట్లాడారని చెప్పాడు. నిజానికి ఒక రీజనల్ ఛానల్ రియాలిటీ షోలో ఎవరైనా గెలుపొందితే అదే పనిగా పిఎం విష్ చేసేంత సీన్ ఎవరికి ఉండదు. ఇది నిజమో కాదో అని ఓ వ్యక్తి ఆర్టిఐ చట్టం(సమాచార హక్కు) కు ఓ అప్లికేషన్ పెట్టి కనుక్కున్నాడు. అయితే అవతల నుండి అటువంటిది ఏమి లేదు అని క్లారిటీ వచ్చింది. దాంతో కౌశల్ అబద్దం చెప్పినట్టు అయింది.
అలానే గిన్నిస్ రికార్డు వాళ్ళు తనను సంప్రదించారని చెప్పాడు కానీ సాధారణంగా వారి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఎవరైతే గిన్నిస్ బుక్ లో పేరు నమోదు చేసుకుందాం అనుకుంటున్నారో ఒక పద్ధతి ప్రకారం సదరు బోర్డుని సంప్రదించాలి. వారు అతనికి సంబంధించి అన్ని జాగ్రత్తగా పరిశీలించి అసలు అతను చెప్పింది నిజమో కాదో తెలుసుకుని కొంత టైం తీసుకుని బుక్ లో ఉంటుందా లేదా అనే సమాచారం పంపుతారు. అంతే తప్ప ఏదో సరదాగా పేరు బుక్ లో నమోదు చేయరు.
అలానే 40 కోట్ల ఓట్ల గురించి ఛానల్ వాళ్ళను అడిగి ఆధారాలు చూపిస్తానని చెప్పిన కౌశల్ ఇంతవరకు చూపించలేదు. సో ఇది కూడా ఫేక్ అని అర్ధం అయిపోయింది. సినిమాల్లో కూడా పెద్దగా ఆఫర్స్ ఏమి రావడంలేదు. ఇలా ఏదిపడితే అది మాట్లాడితే ఇలానే ఉంటుంది కౌశల్ అని సోషల్ మీడియాలో ఆయన వ్యతిరేకులు మరోసారి ట్రోలింగ్ స్టార్ట్ చేశారు.