Advertisementt

బాహుబలి లిస్ట్‌లో థగ్స్ అవుట్.. ఇక ‘2.O’నే?

Thu 15th Nov 2018 05:32 PM
baahubali,thugs of hindostan,2.o movie,target,south  బాహుబలి లిస్ట్‌లో థగ్స్ అవుట్.. ఇక ‘2.O’నే?
Bahubali vs Thugs of Hindostan and 2.O బాహుబలి లిస్ట్‌లో థగ్స్ అవుట్.. ఇక ‘2.O’నే?
Advertisement
Ads by CJ

 

‘బాహుబలి’ సినిమా.. తెలుగు ఇండస్ట్రీ అనేది ఒకటి ఉందని ప్రపంచానికి తెలిసేలా చేసింది. ఇటువంటి సినిమా మన నుండి బయటికి వచ్చినందుకు మనవాళ్లు చాలా ఆనందపడ్డారు. కానీ కోలీవుడ్.. బాలీవుడ్ వారికి ఈ సినిమా చూసిన తరువాత అసూయ కలిగింది. బాలీవుడ్‌లో, కోలీవుడ్ లో రాజమౌళిని మించి సినిమాలు తీసే వాళ్ళు ఉన్నా.. ఇప్పుడు వరకు తీయలేకపోయారు.

బాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ శేఖర్ కపూర్ లాంటి వారు ‘బాహుబలి’ ని ఇన్స్పైర్ అవ్వాలని సూచించారు. కోలీవుడ్ లో శంకర్ కూడా ఈ సినిమాను చూసిన తరువాత ఎట్టిపరిస్థితుల్లో దీనికి మించి సినిమా తీయాలనుకున్నాడు. దాంతో అటు బాలీవుడ్ వారికి ఇటు కోలీవుడ్ వారికి ‘బాహుబలి’ సిరీస్ ఒక ఛాలెంజ్ గా మారింది. అయితే ఈ ఏడాది ఈ రెండు ఇండస్ట్రీల నుంచి ‘బాహుబలి’ని బీట్ చేసే సత్తా ఉన్న చిత్రాలుగా రెండు లైన్లోకి వచ్చాయి. అవే ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’, ‘2.ఓ’.

ఇందులో ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ దీపావళి కానుకగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఆమిర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్ హీరోస్ ని పెట్టుకుని ఈసినిమాను తెరకెక్కించారు. ఆమిర్ మీద నమ్మకంతో ఈసినిమా అన్ని రికార్డ్స్ బద్దలుకొడుతుందని అంతా అనుకున్నారు. ఎందుకంటే ఆమిర్ ఖాన్ కి ఉన్న మార్కెట్ అటువంటిది. అయితే ఈ చిత్రం దారుణమైన ఫలితాన్నందుకుంది. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. దాంతో ‘బాహుబలి’ రికార్డ్స్ సేఫ్ గా ఉన్నాయి. 

ఇక రజినీకాంత్ - శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘2.0’ కోసం ఎదురుచూస్తున్నారు అంతా. ఈ సినిమాపై మొదటి నుండే అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తే సినిమాపై కొంచెం సందేహాలు రేకెత్తించింది. ఈనేపధ్యంలో ఈమూవీ ‘బాహుబలి’ ని బీట్ చేస్తుందా? అన్న అనుమానాలు లేకపోలేదు. ఒకేవేళ ఇది ఫెయిల్ అయితే ‘బాహుబలి’ రికార్డ్స్ ఇంకా కొన్నాళ్ళు పాటు ఎవరు టచ్ చేయలేరు. కానీ శంకర్ ని తక్కువ అంచనా వేయలేం. చూద్దాం ఏం జరుగుతుందో.

Bahubali vs Thugs of Hindostan and 2.O:

After Thugs of Hindostan.. 2.O Targets Baahubali

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ