రవితేజ - విజయ్ దేవరకొండ లు తమ తమ సినిమాలతో ఒక్కరోజు తేడాతో పోటీ పడుతున్నారు. రవితేజ అమర్ అక్బర్ ఆంటోని ఈ నెల 16 న విడుదలవుతుంటే... విజయ్ దేవరకొండ టాక్సీవాలా ఆ తర్వాతి రోజు అంటే 17 న విడుదలవుతుంది. అయితే ట్రేడ్ లో రెండు సినిమాలకు ఓ అన్నంత బజ్ లేదు. రవితేజ ప్లాప్ తో ఉన్నాడు. టచ్ చేసి చూడు, నేల టికెట్ అట్టర్ ప్లాప్స్. ఇక దర్శకుడు శ్రీను వైట్ల సూపర్ డిజాస్టర్స్ తో ఉన్నాడు. అలాగే చాలా గ్యాప్ తరువాత ఇలియానా రీ ఎంట్రీ ఇస్తుంది సినిమాకి క్రేజ్ వస్తుంది అనుకుంటే.. ఇలియానాలో మునుపున్న గ్రేస్ లేదు. సన్నని నడుమున్న ఇలియానా బాగా బొద్దుగా తయారైంది. ఇలియానా మీద ఎలాంటి హోప్స్ లేదు.
ఇక విజయ్ దేవరకొండ టాక్సీవాలకు విజయ్ డిఫరెంట్ గా ప్రమోషన్స్ చేస్తున్నప్పటికీ..... ఎక్కడా హైప్ క్రియేట్ కావడం లేదు. ఎందుకంటే టాక్సీవాలా ఇప్పటికే ఫుల్ మూవీ నెట్‌లో వచ్చేసింది. దీంతో విజయ్ దేవరకొండ సినిమాలకు ఉండే ప్రీ రిలీజ్ బజ్ టాక్సీవాలా విషయంలో తక్కువగా కనిపిస్తోంది. మరి నిన్నగాక మొన్నొచ్చిన టాక్సీవాలా ట్రైలర్ ని నయనతార డోరా సినిమాతో ముడిపెట్టి వార్తలు రాశారు. ఇక సినిమా మీద ఇంట్రెస్ట్ ఏముంటుంది.
మరి అమర్ అక్బర్ ఆంటోని సినిమా ముందుగా శుక్రవారమే విడుదలవుతుంది. ఈ సినిమాలో ఒకవైపు కామెడీ, మరోవైపు థ్రిల్లింగ్ అంశాలతో ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం ఉందని సెన్సార్ టాక్. అంతేకాకుండా ఈ చిత్రంలో సునీల్, వెన్నెల కిషోర్, సత్య, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి లాంటి కమెడియన్స్ ను ఉపయోగించి ఓ హిలేరియస్ ఎపిసోడ్‌ని శ్రీను వైట్ల డిజైన్ చేశాడని ఆ కామెడీ ఎపిసోడ్ అదిరిపోయిందని చెబుతున్నారు. మరి అమర్ అక్బర్ ఆంటోని టాక్ కాస్త లేచింది అంటే.. ఏ మాత్రం బజ్ లేని టాక్సీవాలా కొట్టుకుపోవాల్సిందే. ఎందుకంటే గీత గోవిందం మ్యానియా విజయ్ నోటా విషయంలోనే నడవలేదు. ఇప్పుడు ఈ టాక్సీవాలా విషయంలో ఏం నడుస్తుంది.