‘ఉత్తర’ టీజర్ విడుదల
లివ్ ఇన్ సి క్రియేషన్స్ మరియు గంగోత్రి ఆర్ట్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తూ, తిరుపతి ఎస్.ఆర్. దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘ఉత్తర’. అందమైన గ్రామీణ నేపథ్యంలో, సహజమైన పాత్రలతో రూపొందిన ప్రేమకథా చిత్రం ఉత్తర. దీపావళి సందర్భంగా ఈ ఉత్తర మూవీ యొక్క టీజర్‌ను విడుదల చేశారు. అతిథులెవ్వరూ లేకుండా కేవలం సినిమా టీమ్ మాత్రమే కలిసి ఈ టీజర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు తిరుపతి ఎస్.ఆర్. మాట్లాడుతూ.. ‘‘మా సినిమా పూర్తిగా తెలంగాణ భాష, తెలంగాణ ప్రాంతంలో చేయడం జరిగింది. గుడిసెల్లోకి కూడా పాకిన గ్లోబలైజేషన్‌లో ప్రెజంట్ ట్రెండ్ విలేజెస్ ఎలా ఉన్నాయో, యూత్ ఎలా ఉందో మా సినిమాలో చూపించాం. చలాకీగా బతుకుతున్న ఒక యువకుడి జీవితంలోకి అనుకోని కష్టాలు, సంఘటనలు, ఊహించని మలుపులు, ముళ్లుని ముళ్లుతోనే తీయాలనే లాజిక్‌లతో హీరో తన తెలివితో.. కష్టాల నుంచి బయటపడి తన లవ్వుని, ఫ్యామిలీని ఎలా నిలబెట్టుకున్నాడు అనేదే కథ. ప్రతి ఊళ్లో జరిగినట్లే ఉండే ప్రేమకథ అందరినీ అలరిస్తుంది. ప్రతి ఊరిలో కామన్‌గా ఉండే ఒక కొత్త పాయింట్‌ని మేము ఈ సినిమాలో టచ్ చేశాం. అది అందర్ని థ్రిల్‌కి గురి చేస్తుంది. ఊహించని మలుపులతో అందరినీ ఉత్తేజపరుస్తుందని నమ్మకంతో ఉన్నాం..’’ అని అన్నారు.
చిత్ర హీరో శ్రీరామ్ మాట్లాడుతూ..‘‘ఈ కథ నేను విన్నప్పుడు కంటే షూట్ చేసినప్పుడు దీని గొప్పతనం తెలిసింది. వెరీ హానెస్ట్ అటెంఫ్ట్. ఇంత కసి మీదున్న యంగ్ టీమ్‌ని నేను ఇంతవరకు చూడలేదు. ఈ సినిమాతో నాలాగే మీరు కూడా నవ్వుతారు. థ్రిల్‌కి గురవుతారు. ఈ చిత్రంలో నేను భాగమైనందుకు గర్వపడుతున్నాను..’’ అని అన్నారు.
హీరోయిన్ కారుణ్య మాట్లాడుతూ..‘‘నన్ను నేనే కొత్తగా ఈ చిత్రంలో చూసుకుంటున్నాను.. ఇంత మంచి చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శకుడికి ధన్యవాదాలు. కల్ట్ మూవీస్‌లోనే బెస్ట్ తెలుగు చిత్రంగా ఉంటుందని ఖచ్చితంగా చెప్పగలను. అంతేకాదు.. అందరూ గుర్తుపెట్టుకోండి.. ఈ సినిమా గురించి అందరూ మాట్లాడే రోజు వస్తుంది. అందరికీ ధన్యవాదాలు..’’ అని తెలిపారు.
ఇంకా ఈ చిత్రానికి పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు.