టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ #RRR . ఈ చిత్రం కోసం అటు రామ్ చరణ్ - ఎన్టీఆర్ లతో పాటు మెగా - నందమూరి ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఈనెల 11న ఈ సినిమా అత్యంత గ్రాండ్ గా ప్రారంభమైన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టగా... కె. రాఘవేంద్రరావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. భారీ అంచనాలతో ప్రారంభం అయిన ఈచిత్రం ఈనెల 19 నుండి హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీ పరిసరాల్లోని షూటింగ్ జరుపుకోనుంది. స్టార్టింగే ఈ సినిమాలోని భారీ యాక్షన్ ఎపిసోడ్ ని తెరకెక్కించేందుకు జక్కన్న ప్రణాళికలు సిద్ధం చేశారు.
'బాహుబలి' తరువాత చేస్తున్న చిత్రం కాబట్టి జక్కన్న ఎటువంటి స్టోరీ తో వస్తున్నాడు అని క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. ఇంతకీ ఆ కథ ఏంటి? అన్న డిస్కషన్ మెగా-నందమూరి అభిమానుల్ని వేడెక్కిస్తోంది. ఈ సినిమాను అనౌన్స్ చేసిన దగ్గర నుండే స్టోరీ పై రకరకాలుగా వార్తలు వచ్చాయి. అందులో ఇదోక పీరియాడికల్ మూవీ అని... ఇందులో చరణ్ - ఎన్టీఆర్ బాక్సర్లుగా నటిస్తున్నారని ఇలా వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం రాజమౌళి యూనివర్శల్ అప్పీల్ ఉన్న కథాంశాన్ని ఎంచుకున్నాడని తెలుస్తుంది. ఇది దొంగా పోలీస్ కథ అంట. ఈ కథను రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ అందించారు.
ఇటువంటి కథ అయితే అన్ని భాషల్లో రిలీజ్ చేసుకోవచ్చని రాజమౌళి భావిస్తున్నాడు. తెలుగుతో పాటు.. తమిళం.. హిందీ భాషల్లో ఈ సినిమాను రూపొందించనున్నారు. ఇందులో దొంగగా ఎన్టీఆర్..పోలీస్ గా చరణ్ నటించనున్నారు. ఇందులోనే బాక్సింగ్ నేపథ్యం ఇన్ బిల్ట్ చేశారట. ఇది 1920 లో సాగే కథ అని తెలుస్తుంది. ఇందులో చరణ్ - ఎన్టీఆర్ లుక్ చాలా కొత్తగా ఉంటుందని సమాచారం. ఈనెల 19 నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవ్వబోతుంది. ఆరంభమే ఎన్టీఆర్ - చరణ్ పై దొంగా, పోలీస్ ఛేజ్ దృశ్యాల్ని తీస్తున్నారన్న చర్చ సాగుతోంది. సో ఇప్పుడు నుండే ఇందులో ఎన్టీఆర్ - చరణ్ ఎలా ఉండబోతున్నారని క్యూరియాసిటీ మొదలైంది మెగా - నందమూరి అభిమానుల్లో. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్స్ ఎవరు అనేది ఇంకా ఫైనల్ అవ్వలేదు.