రెండు నెలల క్రితం ట్రైలర్ తోనే సంచలనాలు సృష్టించి.. భారీ అంచనాలుతో తమిళనాట విడుదలైన త్రిష - విజయ్ సేతుపతిల 96 మూవీ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తమిళనాట సంచలనాలు రికార్డులు నమోదు చేసింది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, త్రిషల కెమిస్ట్రీకి అందరూ పడిపోయారు. ఆన్ లైన్ లో హెచ్ డి ప్రింట్ అందుబాటులోకి రావడం.... టీవీల్లో దీపావళి కానుకగా ప్రసారం చేసినప్పటికీ.. ఈ సినిమాకు థియేటర్స్ లో డిమాండ్ తగ్గలేదంటే ఆ సినిమా ఏ రేంజ్ హిట్ అర్ధమవుతుంది. ఇక టీవీల్లో, ఆన్ లైన్ లో చూసిన ప్రేక్షకులు 96 గురించి సోషల్ మీడియాలో పొగడమే కాదు... సినిమా సూపర్ అంటూ ఉచిత ప్రచారం చేస్తున్నారు.
అంత పెద్ద హిట్ అయిన ఆ సినిమా తెలుగులోకి ఎప్పుడొస్తుందో గాని.. తెలుగులో సగం మంది 96 ని తమిళంలో వీక్షించేశారు. అయితే తెలుగులో దిల్ రాజు ఈ సినిమాని రీమేక్ చేస్తాడని.. నాని హీరోగా, సమంత హీరోయిన్ గా నటిస్తుందని ప్రచారం జోరుగా జరిగింది. ఇక సినిమా చూసిన నాని సినిమాలో హీరోగా చేయలేనని... నిర్మాతగా భాగస్వామినవుతానన్నాడు. ఎందుకంటే 96 సినిమాలో 38 ఏళ్ళ వయసులో పోగొట్టుకున్న ప్రేమను విడిపోయిన తన లవర్ ని చానళ్ళు తర్వాత స్కూల్ రీ యూనియన్ లో కలుసుకుంటాడు. కథ అలా జరుగుతున్న మధ్యలో ఆనాటి జ్ఞాపకాలన్నీ వెంటాడుతూ వస్తాయి. ఇక ఆఖరిలో ఎమోషనల్ టచ్ ఉండే క్లైమాక్స్.
మరి అలాంటి 38 యేళ్ళున్న పాత్రలో నటించేందుకు తెలుగులో హీరోలెవరు ముందుకు రావడమే లేదా? లేదంటే ఈ సినిమాని అందరూ తమిళంలోనే ఆన్ లైన్ లో టీవీల్లో చూసేశారు కాబట్టి ఇక్కడ రీమేక్ చెయ్యడం ఎందుకనుకుంటున్నారా? ఏమో అర్ధం కానీ విషయం అది.