భవిరి శెట్టి వీరాంజనేయులు, రాజ్యలక్ష్మీ సమర్పణ.. గురుచరణ్ నిర్మాణ సారథ్యంలో కుభేర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై మహిధర్, శ్రావ్యారావు హీరో హీరోయిన్‌గా నటించిన చిత్రం 'నటన'. భారతీబాబు పెనుపాత్రుని దర్శకత్వంలో కుభేర ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రభు ప్రవీణ్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలను సోమవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో విడుదల చేశారు. శివాజీరాజా, భానుచందర్ ఆడియో సీడీలను విడుదల చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు భారతీబాబు పెనుపాత్రుని మాట్లాడుతూ - ‘‘నిర్మాత ప్రసాద్‌గారికి కథ చెప్పాను. ఆయన నచ్చింది. నన్నే డైరెక్ట్ చేయమన్నారు. అలా నేను డైరెక్టర్ అయ్యాను. లీడ్ క్యారెక్టర్స్ కోసం వెతుకుతున్నప్పుడు నిర్మాతగారే భానుచందర్‌గారి పేరును సజెస్ట్ చేశారు. మేం ఆయన్ని కలవగానే ఆయన సినిమా చేయడానికి అంగీకరించినందుకు థాంక్స్. జీవితం గురించి తెలియజేసే ప్రయత్నమే చిత్రం. హీరో, హీరోయిన్ చక్కగా నటించారు. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్’’ అన్నారు.
నిర్మాత కుభేర ప్రసాద్ మాట్లాడుతూ - ‘‘ఈ సినిమా గురించి విడుదల తర్వాత ప్రేక్షకులు మాట్లాడితే బావుంటుందని నా అభిప్రాయం. సినిమాలో నాలుగు పాటలు అద్భుతంగా వచ్చాయి. సినిమా డైరెక్టర్ అద్భుతంగా తీర్చిదిద్దారు. సినిమా తప్పకుండా హిట్ అవుతుంది’’ అన్నారు.
ఎం.ఎం.శ్రీలేఖ మాట్లాడుతూ... ‘‘సినిమాలో ఓ సాంగ్‌కు మ్యూజిక్ కంపోజ్ చేసి పాట పాడాను. మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. మ్యూజిక్ డైరెక్టర్ ప్రభుప్రవీణ్ చక్కటి సంగీతం, నేపథ్య సంగీతాన్ని అందించారు. సినిమా పెద్ద హిట్టై నిర్మాతకు మంచి లాభాలను తెచ్చి పెట్టాలి’’ అన్నారు.
భానుచందర్ మాట్లాడుతూ - ‘‘చాలా కాలం తర్వాత తెలుగులో సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఎం.ఎం.శ్రీలేఖగారు పాటను చక్కగా పాడారు. సినిమాకు ఆ పాట హైలైట్ అవుతుంది. మంచి కంటెంట్ ఉన్న డైరెక్టర్ భారతీబాబు ఈ సినిమాను అద్భుతంగా మలిచారు. ప్రసాద్‌గారు సినిమాను చక్కగా నిర్మించారు. అన్ని ఎలిమెంట్స్ చక్కగా కుదిరాయి. తప్పకుండా సినిమాని ఆదరించాలి’’ అన్నారు.
శివాజీ రాజా మాట్లాడుతూ ‘‘టైటిల్ చాలా బావుంది. భాను చందర్ చాలా రోజుల తర్వాత తెలుగులో చాలా మంచి పాత్ర చేశాడు. పాటలు బావున్నాయి. దర్శకుడు భారతీబాబు సినిమాను చక్కగా తెరకెక్కించారు. నిర్మాత ప్రసాద్‌కు అభినందనలు. హీరో హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఈ సినిమా మంచి పేరు తేవాలి’’ అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ ప్రభు ప్రవీణ్ మాట్లాడుతూ - ‘‘అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. పాటలు, నేపథ్య సంగీతం చక్కగా కుదిరాయి. ఎం.ఎం.శ్రీలేఖగారికి థాంక్స్’’ అన్నారు.
ఈ కార్యక్రమంలో కాశీవిశ్వనాథ్, గురుచరణ్, రఘు, హీరో మహిధర్, హీరోయిన్ శ్రావ్యారావు తదితరులు పాల్గొని చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు.
మహీధర్, శ్రావ్యారావు, భానుచందర్, రఘుబాబు, ప్రభాస్ శ్రీను, రఘువర్మ, సూర్య, నళిని, జబర్‌దస్త్ ఫణి, అప్పారావు, దొరబాబు, శారదా సాహిత్య, సూర్య కుమారి తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటర్: వి.నాగిరెడ్డి, సంగీతం: ప్రభు ప్రవీణ్ లంక, ఆర్ట్: విజయ్ కృష్ణ, డాన్స్: గోపీ కుమార్, చార్లీ రాక్‌స్టార్, ఫైట్స్: నందు, సాహిత్యం: భారతీబాబు, లైన్ ప్రొడ్యూసర్స్: ఎన్. వెంకటేశ్వరరావు, అక్కినేని శ్రీనివాసరావు, కోడైరెక్టర్స్: ప‌్రభాకర్, రామయ్యరాజు, కెమెరా: వాసు, నిర్మాత: కుభేర ప్రసాద్, రచన, దర్శకత్వం: భారతీబాబు పెనుపాత్రుని.