Advertisementt

‘సైరా’.. సీతారామరాజుగా మారుతున్నాడా?

Tue 13th Nov 2018 07:22 PM
chiranjeevi,sye raa,alluri seetharamaraju,sye raa narasimha reddy,mega star  ‘సైరా’.. సీతారామరాజుగా మారుతున్నాడా?
Chiranjeevi plays One more Role in Sye Raa ‘సైరా’.. సీతారామరాజుగా మారుతున్నాడా?
Advertisement
Ads by CJ

రాజకీయాలలో చక్రం తిప్పాలని ఎన్నో ఆశలతో కొత్త పార్టీ స్థాపించి మరీ పోటీ చేసిన మెగాస్టార్ చిరంజీవికి తీవ్ర నిరాశే ఎదురైంది. పార్టీ పెట్టిన అతి తక్కువ వ్యవధిలోనే మూసేసి, వేరొక పార్టీలో విలీనం చేసేసి.. కొన్నాళ్లు ఏదో మొక్కుబడిగా రాజకీయాలలో మెలిగిన మెగాస్టార్.. ఇప్పుడు పూర్తిగా రాజకీయాలకు గుడ్‌బై చెప్పేస్తున్నారు. అదెలా అంటే.. ఆయన ప్రస్తుతం చేస్తున్న సినిమాలే ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. రీ ఎంట్రీ‌లో ఖైదీ నెంబర్ 150 అంటూ కనిపించి బాక్సాఫీస్‌‌ని షేక్ చేసిన మెగాస్టార్.. ఇప్పుడు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘సైరా’ చిత్రీకరణలో బిజీబిజీగా మారిపోయారు. ఒకవైపు తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుని ఉన్నా.. తనకేం పట్టనట్లుగా.. చిరంజీవి షూటింగ్‌లతో బిజీబిజీగా గడిపేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ‘సైరా’ తర్వాత చేసే చిత్రంలో కూడా లైన్‌లో పెట్టేశారు. వరుస బ్లాక్‌బస్టర్స్ దర్శకుడు కొరటాల శివతో.. చిరంజీవి 152వ చిత్రం ఉండబోతోందని ఇప్పటికే అఫీషియల్ సమాచారం వచ్చేసింది. మరి ఇలాంటి టైమ్‌లో ఇంకా చిరు రాజకీయాలలోకి వెళ్లే ధైర్యం చేస్తారా? అంటే చెప్పడం కష్టమే.

ఇక విషయంలోకి వస్తే..  ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథగా తెరకెక్కుతున్న ‘సై రా’ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించి తాజాగా టాలీవుడ్ సర్కిల్స్‌లో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి మరో పాత్రలో కూడా కనిపిస్తారట. సైరా నరసింహారెడ్డిలో వీరయోధుడిగా కనిపించనున్న చిరంజీవి.. మన్యం వీరుడు అల్లూరి సీతరామరాజుగా కూడా ఈ చిత్రంలో కనిపిస్తారట. 

బ్రిటీష్ వారి చేతిలో నరసింహారెడ్డి ప్రాణాలు కోల్పోయిన తర్వాత, ఆయన స్ఫూర్తితో కొంతమంది విప్లవ వీరులుగా మారి బ్రిటీష్ వారిపై తిరుగుబాటు చేసే సన్నివేశాలను కూడా ఇందులో చూపించనున్నారట. ఇక విప్లవ వీరులలో ముఖ్యమైన అల్లూరి సీతారామరాజు పాత్రని కూడా ఇందులో చూపించనున్నారని, అల్లూరిగా కూడా చిరంజీవి కనిపించనున్నారని వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందనేది తెలియదు కానీ.. అల్లూరి సీతారామరాజుగా చిరంజీవి కనిపించబోతున్నాడనే వార్తతో మెగాభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ.. సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు.

Chiranjeevi plays One more Role in Sye Raa:

Mega Star Chiranjeevi Turns Alluri Seetharamaraju for Sye Raa

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ