Advertisementt

మహర్షి బిజినెస్ ఏంటి.. ఈ రేంజ్ లోనా?

Tue 13th Nov 2018 12:05 PM
mahesh babu,maharshi,digital rights,amazon prime  మహర్షి బిజినెస్ ఏంటి.. ఈ రేంజ్ లోనా?
Amazon Prime Takes Maharshi Digital Rights మహర్షి బిజినెస్ ఏంటి.. ఈ రేంజ్ లోనా?
Advertisement
Ads by CJ

మహేష్ బాబు - వంశి పైడిపల్లి కలయికలో మహర్షి సినిమా షూటింగ్ అమెరికా షెడ్యూల్ ముగించుకుని హైదరాబాద్ లో మొదలు పెట్టారు. హైదరాబాద్ లోని విలేజ్ సెట్ లో దాదాపుగా 25 రోజుల పాటు మహర్షి షూటింగ్ జరుగుతుంది. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమాపై అన్ని భారీ వార్తలే వినవస్తున్నాయి. నిన్నటికి నిన్న ఈ సినిమా నిర్మాత దిల్ రాజు మహర్షి హిందీ డబ్బింగ్ రైట్స్ డీల్ ని 20 కోట్లకు సెట్ చేసినట్లుగా వార్తలొచ్చాయి. ఇక ఈ రోజు మహర్షి డిజిటల్ హక్కులు విషయంలో మరో సెన్సేషనల్ న్యూస్ వినబడుతుంది. 

ఈమధ్యన అన్ని సినిమాలు శాటిలైట్ హక్కులకు ఎంత డిమాండ్ ఉంటుందో డిజిటల్ హక్కులకు అంతే డిమాండ్ ఉంటుంది. పెద్ద ప్రాజెక్ట్ లు డిజిటల్ హక్కులతో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాయి. అందుకే శాటిలైట్ హక్కుల విషయంలో ఎంత క్రేజుందో.. అంతే క్రేజ్ డిజిటల్ హక్కులకు ఏర్పడింది. తాజాగా మహేష్ మహర్షి డిజిటల్ డీల్ కూడా తెగినట్లుగా తెలుస్తుంది. అమెజాన్ ప్రైమ్ మహర్షి డిజిటల్ హక్కులను దాదాపు 12 కోట్లతో డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు సమాచారం. మరి ఈ ఫిగర్ చూస్తుంటే భారీ సినిమాల డిజిటల్ హక్కులకు ఎంత క్రేజుందో అర్ధమవుతుంది. మరి శాటిలైట్, డిజిటల్, రీమేక్, హిందీ శాటిలైట్స్ ద్వారానే మహర్షికి పెట్టిన పెట్టుబడిలో నిర్మాతలకు సగం పైనే వచ్చేలా కనబడుతుంది.

Amazon Prime Takes Maharshi Digital Rights:

Big Offer to Mahesh Babu Maharshi Digital Rights

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ