టాలీవుడ్, బాలీవుడ్ అనే కాకుండా అన్నీ ఇండస్ట్రీలలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా నడుస్తున్న ఉద్యమం ‘మీ టూ’. శ్రీరెడ్డి నుంచి చిన్మయి వరకు అందరూ దీనిపై ముక్తకంఠంగా స్పందిస్తూ.. నిత్యం వార్తల్లో నిలిచేలా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళుతున్నారు. మరి ‘మీ టూ’ వల్ల ఏమైనా లాభం చేకూరిందా? అంటే సమాధానం చెప్పడం కష్టమే. ఎందుకంటే ‘మీ టూ’ని అడ్డం పెట్టుకుని కొందరు పబ్బం గడుపుకోవాలని కూడా చూస్తుండటంతో.. దీనిపై రెండు రకాల మాటలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా స్టార్ హీరోల విషయానికి వచ్చేసరికి ఈ ఉద్యమం నీరుగారిపోతుంది.
ఇక విషయంలోకి వస్తే.. టాలీవుడ్ వదిలి బాలీవుడ్ పోయేటప్పుడు.. దాదాపు ‘మీ టూ’ వంటి ఆరోపణలే చేసి వెళ్లిన ఇలియానా.. మళ్లీ ఇప్పడు ‘అమర్ అక్బర్ ఆంథోనీ’తో రీ ఎంట్రీ ఇస్తోంది. అప్పుడు టాలీవుడ్‌పై ఆరోపణలు చేసి వెళ్లిన ఇలియానా.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను బాగా మిస్ అయ్యానంటూ ఇటీవల ఓ ఈవెంట్‌లో చెప్పుకొచ్చింది. తాజాగా ఆమె ఈ ‘మీ టూ’పై కూడా మాట్లాడింది.
స్త్రీ, పురుషులు ఎవరైనా సరే.. లైంగిక వేధింపులను ఎదుర్కొన్న వారు ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పడమనేది మంచి పరిణామం. ఒకప్పుడు భయపడేవారు. ఏం చెబితే ఏం అవుతుందో అని. నిజంగా లైగింక వేధింపులు అనేది ఒక భయానక అనుభవం. ఇలాంటివి ఎదుర్కొన్నవారు ముందుకు వచ్చారు కాబట్టే.. ఈ రోజు దీని గురించి చర్చలు జరుగుతున్నాయి. ఎవరో ఒకరు ముందుకు వస్తేనే కదా.. సమస్యలు తీరేది. లేదంటే ఇటువంటి సమస్యలపై మరింతగా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక నా వరకు మాత్రం నేను దీనిపై ఇప్పుడేం స్పందించను. స్పందించాల్సిన సమయంలో మాత్రం ఖచ్చితంగా స్పందిస్తానంటోంది ఇలియనా.