Advertisementt

ఎన్టీఆర్.. ‘మహానాయకుడు’ డౌటే?

Mon 12th Nov 2018 08:10 PM
balakrishna,ntr biopic,mahanayakudu,release date,postponed  ఎన్టీఆర్.. ‘మహానాయకుడు’ డౌటే?
Doubts on NTR Mahanayakudu ఎన్టీఆర్.. ‘మహానాయకుడు’ డౌటే?
Advertisement
Ads by CJ

క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. ‘కథానాయకుడు, మహానాయకుడు' గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ట్రేడ్ లో భారీ అంచనాలే ఉన్నాయి. ఎన్టీఆర్ నట జీవితంలో పోషించిన పలు పాత్రలను కథానాయకుడిలో ఎన్టీఆర్ పాత్రధారి బాలకృష్ణ పోషిస్తున్నాడు. ఎన్టీఆర్ పాత్రల్లో హైలెట్ గా నిలిచిన పాత్రలను బాలయ్య కూడా తన హావ భావాలతో అదరగొడుతున్నాడట. ఇప్పటికే 'కథానాయకుడు' షూటింగ్ పూర్తి కావొచ్చిందని.. చిన్న చిన్న ప్యాచ్ వర్ల్క్ లు తప్ప షూటింగ్ పెద్దగా బ్యాలెన్స్ లేదంటున్నారు.

ఇక 'మహానాయకుడు' షూటింగ్ కూడా క్రిష్ ఎప్పుడో మొదలెట్టేశాడని... సినిమా విడుదలకు అట్టే సమయం లేకపోవడంతో క్రిష్ నిర్విరామంగా ఈ సినిమా కోసం పని చేస్తున్నాడని.... ఈ సినిమాని సంక్రాంతికి, రిపబ్లిక్ డే కి విడుదల చెయ్యడానికి మేకర్స్ ఎప్పుడో ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే మొన్నీ మధ్యన రామ్ గోపాల్ వర్మ కూడా తన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ని, ఎన్టీఆర్ బయోపిక్ 'మహానాయకుడి'కి పోటీగా విడుదల చేస్తానంటూ చెప్పడంతో... క్రిష్ - బాలకృష్ణ ఎన్టీఆర్ 'మహానాయకుడు' పోస్ట్ పోన్ చేస్తున్నట్లుగా వార్తలొచ్చాయి.

కానీ ఇప్పుడు 'మహానాయకుడు' నిజంగానే పోస్ట్ పోనే అయ్యేలా కనబడుతుంది. రామ్ గోపాల్ వర్మకి భయపడి కాదు కానీ... బయ్యర్ల గోల పడలేకపోతున్నారట. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలను రెండు వారాల గ్యాప్ లో విడుదల చేస్తామని చెప్పారు. 'కథానాయకుడు' జనవరి 9 న, 'మహానాయకుడు' జనవరి 24  విడుదల అంటూ ప్రకటించారు. అయితే రెండు వారాల గ్యాప్ తో ఈ రెండు పార్ట్ లు ప్రేక్షకుల ముందుకు రావడం.... తమకి గిట్టుబాటు కాదనే అభిప్రాయాన్ని బయ్యర్లు వ్యక్తం చేశారట. అయితే బయ్యర్లు చెబుతున్న మాట కూడా వాస్తవమే గనక 'మహానాయకుడు' సినిమా జనవరి 24 నుండి ఫిబ్రవరి 14వ తేదీన విడుదల చేయాలనే నిర్ణయానికి మేకర్స్ వచ్చినట్లుగా తెలుస్తుంది. మరి ఇదెంత వరకు కరెక్ట్ అనేది ఎన్టీఆర్ చిత్ర బృందమే స్పందించేవరకు తెలియదు.

Doubts on NTR Mahanayakudu:

NTR Mahanayakudu release date postponed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ