Advertisementt

‘వినయ విధేయ రామ‘.. చిరు, ఎన్టీఆర్, రాజమౌళి!!

Mon 12th Nov 2018 01:37 PM
chiru,jr ntr,rajamouli,chief guest,vinaya vidheya rama,audio launch  ‘వినయ విధేయ రామ‘.. చిరు, ఎన్టీఆర్, రాజమౌళి!!
Vinaya Vidheya Rama Audio Launch place fixed ‘వినయ విధేయ రామ‘.. చిరు, ఎన్టీఆర్, రాజమౌళి!!
Advertisement
Ads by CJ

బోయపాటి శ్రీను - రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం 'వినయ విధేయ రామ'. ఈ సినిమా యొక్క టీజర్ రెండు రోజులు కిందట రిలీజ్ అయి సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుంది. మాస్ కు మతిపోయేలా ఈ టీజర్ ఉండటంతో ఇది 100 కోట్ల షేర్ ను కొల్లగొట్టటం పెద్ద విషయం కాదని ట్రేడ్ అంచనా వేస్తుంది. టీజర్ లో రామ్ చరణ్ చెప్పే 'రామ్ కొణిదెల' డైలాగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ప్రస్తుతం ఈ చిత్రం టాకీ పార్ట్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. మిగిలిన రెండు సాంగ్స్ డిసెంబర్ నెలలో స్టార్ట్ చేసి.. ఆడియో లాంచ్ ను డిసెంబర్ ఎండింగ్ లో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. రామ్ చరణ్ కు అచ్చొచ్చిన వైజాగ్ లో ఆడియో లాంచ్ ను చేయాలనీ ప్రొడ్యూసర్స్ ఆలోచనట. రంగస్థలం సినిమా ఆడియో ఈవెంట్ కూడా వైజాగ్ లోనే జరిగింది. ఆ సినిమా  ఘన విజయాన్ని అందుకోవడంతో 'వినయ విధేయ రామ' ఆడియోను అక్కడే రిలీజ్ చేయాలనే నిర్ణయానికి వచ్చారట.

మెగాస్టార్ చిరంజీవితో పాటు ఎన్టీఆర్.. రాజమౌళిని ఈ ఆడియో లాంచ్ కి పిలవాలని చరణ్ ఆలోచనట. సో ఇది కనుక నిజం అయితే ఫ్యాన్స్ కు ఇది పండగలాంటి వార్త. త్వరలోనే డేట్ ను ఫిక్స్ చేసి ఎనౌన్స్ చేస్తారని తెలుస్తోంది. భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా జనవరి 11వ తేదీన ఈసినిమా  రిలీజ్ కానుంది.

Vinaya Vidheya Rama Audio Launch place fixed:

Chiru, jr NTR, Rajamouli Chief Guest for Vinaya Vidheya Rama Audio Launch

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ