Advertisementt

‘కవచం’ టీజర్ వచ్చేస్తోంది

Mon 12th Nov 2018 12:26 PM
kavacham,teaser release date,bellamkonda sai srinivas,kajal agarwal,kavacham movie  ‘కవచం’ టీజర్ వచ్చేస్తోంది
Kavacham Movie Teaser Release date Out ‘కవచం’ టీజర్ వచ్చేస్తోంది
Advertisement
Ads by CJ

న‌వంబ‌ర్ 12న బెల్లంకొండ శ్రీ‌నివాస్ క‌వ‌చం టీజ‌ర్ విడుద‌ల‌.. 

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజ‌ల్ అగ‌ర్వాల్ జంట‌గా తెర‌కెక్కుతున్న‌ చిత్రం క‌వ‌చం. ఈ చిత్ర టీజ‌ర్ న‌వంబ‌ర్ 12న విడుద‌ల కానుంది. దీవాళికి విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌స్తోంది. ఇందులో ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ గా న‌టిస్తున్నారు బెల్లంకొండ శ్రీ‌నివాస్. కొత్త ద‌ర్శ‌కుడు శ్రీ‌నివాస్ మామిళ్ళ ఈ థ్రిల్ల‌ర్ ను తెర‌కెక్కిస్తున్నారు. మెహ్రీన్ కౌర్, హ‌ర్షవ‌ర్ధ‌న్ రానే, బాలీవుడ్ న‌టుడు నీల్ నితిన్ ముఖేష్ ఇందులో కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే క‌వ‌చం షూటింగ్ పూర్త‌యింది. కేవ‌లం పాట‌ల చిత్రీక‌ర‌ణ మాత్ర‌మే బ్యాలెన్స్ ఉంది. ఎస్ఎస్ థ‌మ‌న్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఛోటా కే నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. వంశ‌ధార క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై న‌వీన్ సొంటినేని(నాని) క‌వచం చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబ‌ర్ లో ఈ చిత్రం విడుద‌ల కానుంది. 

న‌టీన‌టులు: 

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజ‌ల్ అగ‌ర్వాల్, మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా, నీల్ నితిన్ ముఖేష్, హ‌ర్షవ‌ర్ధ‌న్ రాణే, పోసాని కృష్ణ‌ముర‌ళి, స‌త్యం రాజేష్, అపూర్వ‌.. 

సాంకేతిక నిపుణులు: 

ద‌ర్శ‌కుడు: శ్రీ‌నివాస్ 

నిర్మాత‌: న‌వీన్ సొంటినేని

నిర్మాణ సంస్థ‌: వ‌ంశ‌ధార క్రియేష‌న్స్ 

స‌హ నిర్మాత‌: చాగంటి సంత‌య్య 

సంగీతం: ఎస్ఎస్ థ‌మ‌న్ 

సినిమాటోగ్ర‌ఫర్: ఛోటా కే నాయుడు 

ఎడిట‌ర్: ఛోటా కే ప్ర‌సాద్ 

ఆర్ట్ డైరెక్ట‌ర్: చిన్నా 

పిఆర్ఓ: వ‌ంశీ శేఖ‌ర్

Kavacham Movie Teaser Release date Out:

Kavacham Movie Teaser Release on Nov 12

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ