Advertisementt

టాక్సీవాలా ప్రీ రిలీజ్: చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా?

Sat 10th Nov 2018 02:14 PM
allu arjun,chief guest,vijay deverakonda,taxiwala,pre release,event  టాక్సీవాలా ప్రీ రిలీజ్: చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా?
Taxiwala Pre release event on Nov 11 టాక్సీవాలా ప్రీ రిలీజ్: చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా?
Advertisement
Ads by CJ

ఈనెల 11న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా టాక్సీవాలా ప్రీ రిలీజ్ ఫంక్షన్

గీత గోవిందం సినిమాతో విజయ్ దేవరకొండ పాపులారిటీ ఎంతలా పెరిగిందో అందరికీ తెలిసిందే. అలాంటి పాపులర్ హీరో ఇప్పుడు టాక్సీవాలా అంటూ సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు. మంచి అభిరుచి గల నిర్మాణ సంస్థలుగా పేరు తెచ్చుకున్న జిఏ2 పిక్చ‌ర్స్ మ‌రియు యు.వి. క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించింది. ఎస్ కె ఎన్ ఈ చిత్రంతో నిర్మాతగా.... రాహుల్ సంకృత్యాన్ దర్శకుడిగా పరిచయమౌతున్నారు. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్స్, సాంగ్స్, ప్రమోషనల్ వీడియోలతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఈ అంచనాల్ని మరింత పెంచే విధంగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను గ్రాండ్ లెవల్లో ప్లాన్ చేశారు. ఈ నెల 11న జరగబోయే ఈ వేడుకకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వస్తుండండం విశేషం. టాక్సీవాలా ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని.... మంచి ప్రశంసలు అందుకుంది. యు బై ఏ సర్టిఫికెట్ తో టాక్సీవాలా నవంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఎస్‌.కె.ఎన్‌ మాట్లాడుతూ... విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్, పాపులారిటీ దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని నిర్మించాం. విజ‌య్ ఇమేజ్ కి  తగ్గట్టుగానే అన్ని వర్గాల్ని ఎంటర్ టైన్ చేసే విధంగా దర్శకుడు రాహుల్ తీర్చిదిద్దాడు. గీత గోవిందం వంటి భారీ బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత ఏర్పడిన అంచనాలను దృష్టిలో ఉంచుకొని టాక్సీవాలాను గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నాం. ఈనెల 11న జరగబోయే ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను కూడా భారీగా ప్లాన్ చేశాం. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు ఈ ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ గా రానున్నారు. ఇక ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని యూ బై ఏ సర్టిఫికెట్ పొందింది. సెన్సార్ సభ్యుల నుంచి వచ్చిన ప్రశంసలు మాలో మరింత కాన్ఫిడెన్స్ ను పెంచాయి. డైరెక్టర్ రాహుల్ టేకింగ్, సుజిత్ విజువల్స్, జేక్స్ మ్యూజిక్, కృష్ణకాంత్ లిరిక్స్, జాషువా స్టంట్స్ ఈ చిత్రం లో హైలైట్ గా నిలుస్తాయి. స్ట్రాంగ్ కంటెంట్, ఆర్టిస్టుల పెర్ ఫార్మెన్స్ ను దృష్టిలో ఉంచుకొని ఈ చిత్రాన్ని గ్రాండియర్ గా నిర్మించాం. హిలేరియస్ సస్పెన్స్ సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ  చిత్రాన్ని అత్యధిక థియేటర్లలో నవంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నాం. అని అన్నారు. 

Taxiwala Pre release event on Nov 11:

Allu Arjun Chief Guest for Taxiwala Pre release event

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ