Advertisementt

మహేష్ తర్వాత సినిమా ఈ డైరెక్టర్‌తోనా?

Sat 10th Nov 2018 12:03 PM
mahesh babu,next movie,krish,director  మహేష్ తర్వాత సినిమా ఈ డైరెక్టర్‌తోనా?
Mahesh Babu next movie Confirmed మహేష్ తర్వాత సినిమా ఈ డైరెక్టర్‌తోనా?
Advertisement
Ads by CJ

ప్రస్తుతం మహేష్ తన 25వ చిత్రం గా 'మహర్షి' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రం దిల్ రాజు..పీవీపీ..అశ్విని దత్ ముగ్గురు కలిసి నిర్మిస్తున్నారు. ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు.. ఈ సినిమా తరువాత మహేష్ తన 26వ చిత్రంగా సుకుమార్ డైరెక్షన్ లో చేయనున్నాడు.

సుకుమార్ సినిమా తరువాత చిత్రంని కూడా లైన్ లో పెట్టేశాడు మహేష్. ఈ సినిమా తర్వాత క్రిష్ తో తన 27వ సినిమాను చేయనున్నాడని తెలుస్తుంది. దీనికి అల్లు అరవింద్ నిర్మాత అని సమాచారం. మహేష్ 27వ చిత్రం గీత ఆర్ట్స్ బ్యానర్ లో సందీప్ వంగా చేయాల్సివుంది.. కానీ అల్లు అరవింద్ అతని స్థానంలో క్రిష్ ను తీసుకునేందుకు నిర్ణయం తీసుకున్నాడట. ప్రస్తుతం మహేష్ కు ఓ అనుభవజ్ఞుడైన దర్శకుడు అవసరం అని ఆ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

ఆ మధ్య క్రిష్ మహేష్ తో సినిమా చేయడానికి 'శివం' పేరుతో ఒక స్క్రిప్ట్ తయారు చేసుకుని మహేష్ ను కలిశాడు.. కానీ అది ఎందుకో వర్క్ అవుట్ అవ్వలేదు. మళ్లీ ఇప్పుడు ఈ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. అయితే అల్లు అరవింద్ తీసుకున్న నిర్ణయం కరెక్టేనా అని కొంతమంది అంటున్నారు. ఎందుకంటే క్రిష్ సబ్జెక్ట్స్ ఏమో క్లాసీగా ఉంటాయి. ఎక్కువగా హిస్టారికల్ సబ్జెక్ట్స్ వైపు వెళ్తుంటాడు. మరి మహేష్ కు సూటయ్యే కమర్షియాలిటీ ఉన్న స్క్రిప్ట్ ను తయారు చేయగలడా లేదా అనేది కూడా సందేహమే. మరి ఈ నిర్ణయం ఎంతవరకు కరెక్ట్ అన్నది పెద్ద ప్రశ్న!

Mahesh Babu next movie Confirmed:

Mahesh Babu and Krish Combo soon

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ